

CHANDRABABU NAIDU : ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు ఎప్పుడూ ఏవిధంగా ఉంటాయో ఎవ్వరూ ఊహించడం చాలా కష్టం అనే చెప్పాలి. అక్కడి ప్రజలు ఎప్పుడూ ఎవ్వరినీ అధికారంలో కూర్చుబెడతారో తెలియదు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడింది. ఆ తరువాత 2014లో ఎన్డీఏ కూటమి ప్రభుత్వం ఏర్పడింది. 2019 ఎన్నికల్లో వైసీపీ అధికారంలోకి వచ్చింది. 2024 అసెంబ్లీ ఎన్నికల్లో మళ్లీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన విషయం తెలిసిందే. CHANDRABABU NAIDU
CHANDRABABU NAIDU ATTEMPTS TO GO DEPUTY PRIME MINISTER
ప్రస్తుత సీఎం నారా చంద్రబాబు నాయుడు తరువాత తన కుమారుడు నారా లోకేష్ సీఎం అయ్యే అవకాశాలున్నట్టు వార్తలు వినిపిస్తున్నాయి. మరోవైపు సీఎం చంద్రబాబు ఉప ప్రధానిగా వెళ్లాలని భావిస్తున్నారట. ఇందుకోసం అంబానీ, అదానీలతో పాటు కొంత మంది స్వామీజీల మద్దతు కోసం ప్రయత్నాలు జరుగుతున్నట్టు తెలుస్తోంది. ఏపీలో లోకేష్ ను సీఎం చేయడానికి డిప్యూటీ సీఎంగా ఉన్న పవన్ కళ్యాణ్ కూడా ఒప్పుకున్నట్టు సమాచారం. CHANDRABABU NAIDU
Also Read : MINISTER SITAKKA : మంత్రి సీతక్క ఇలాకాలో రైతుల భూములను లాక్కుంటున్నఫారెస్ట్ అధికారులు
మరోవైపు 2029లో ఎన్డీఏ కూటమి అధికారంలోకి వస్తే.. ప్రస్తుతం డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కి రెండేళ్ల సీఎం పదవీ ఇస్తామని హామీ ఇచ్చారట చంద్రబాబు నాయుడు. అదే సమయంలో చంద్రబాబు సూచన ప్రకారం.. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ అంగీకరించారు. దీంతో నారా లోకేష్ పట్టాభిషేకానికి మార్గం సుగమం అయిందని సోషల్ మీడియాలో వార్తలు చక్కర్లు కొట్టడం విశేషం. లోకేష్ ను సీఎం చేశాక కేంద్రానికి వెళ్లాలని చంద్రబాబు ప్రయత్నాలు చేస్తున్నారు. అయితే కేంద్రం మాత్రం ఇంకా చంద్రబాబును నమ్మడం లేదట. క్యాబినెట్ మంత్రి లేదా ఉప ప్రధాని పదవీ ఇవ్వడానికి సుముఖంగా లేదని తెలుస్తోంది. గవర్నర్ గా పంపాలని కేంద్రం ఆలోచన చేస్తున్నట్టు సమాచారం. ఏం జరుగుతుందనేది వేచి చూడాలి. CHANDRABABU NAIDU
Also Read : KISHAN REDDY : సీఎం రేవంత్ రెడ్డికి కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి సంచలన లేఖ



















