KISHAN REDDY : సీఎం రేవంత్ రెడ్డికి కేంద్ర మంత్రి కిష‌న్ రెడ్డి సంచ‌ల‌న లేఖ

KISHAN REDDY : సీఎం రేవంత్ రెడ్డికి కేంద్ర మంత్రి కిష‌న్ రెడ్డి సంచ‌ల‌న లేఖ

KISHAN REDDY : తెలంగాణ‌లో మార్చి 16 నుంచి బ‌డ్జెట్ స‌మావేశాలు ప్రారంభం కానున్న విష‌యం తెలిసిందే. అయితే ఆర్థిక ప‌రిస్థితి పై సీఎం రేవంత్ రెడ్డి శ్వేత ప‌త్రం విడుద‌ల చేయాల‌ని కేంద్ర మంత్రి కిష‌న్ రెడ్డి తాజాగా సీఎం రేవంత్ రెడ్డికి ఓ బ‌హిరంగ లేఖ రాశారు. ఈ సంద‌ర్బంగా ఆయ‌న మీడియాతో మాట్లాడారు. అప్పులు లేకుండా తెలంగాణ ప్ర‌భుత్వం ఏ ఒక్క ప‌ని కూడా చేయ‌లేని ప‌రిస్థితి దాపురించింది అన్నారు. KISHAN REDDY

UNION MINISTER KISHAN REDDY LETTER TO CM REVANTH REDDY

తెలంగాణ ఏర్పిడిన స‌మ‌యంలో మిగులు నిధుల‌తో ఏర్ప‌డిన రాష్ట్రం ప‌దేళ్ల బీఆర్ఎస్ పాల‌న‌లో, 27 నెల‌ల కాంగ్రెస్ పాల‌న‌లో తెలంగాణ‌కు ప‌ట్టిన దుస్థితికి రాష్ట్ర ఆర్థిక ప‌రిస్తితి అద్దం ప‌డుతోంద‌న్నారు. ప్ర‌తి యేటా రాష్ట్ర త‌ల‌స‌రి అప్పు పెరుగుతుంద‌ని ఆర్థిక దుస్తితి తెలియ‌జేస్తోంద‌న్నారు. ఇలాంటి ప‌రిస్థితుల్లో రాష్ట్రానికి సంబంధించిన వాస్త‌వాల‌ను తెలంగాణ ప్ర‌జ‌ల ముందుంచాల్సిన అవ‌స‌రం ప్ర‌భుత్వానికి ఉంద‌న్నారు కిష‌న్ రెడ్డి.

Also Read : CM REVANTH REDDY : రాహుల్ గాంధీ ప్ర‌ధాని ప‌ద‌వీ పై సీఎం రేవంత్ రెడ్డి సెన్షేష‌న్ కామెంట్స్

ప్ర‌ధానంగా 2023 అసెంబ్లీ ఎన్నిక‌ల స‌మ‌యంలో కాంగ్రెస్ మ్యానిఫెస్టో ద్వారా 6 గ్యారెంటీల‌తో పాటు 420 హామీల‌ను ఇచ్చింది. ఈ మోస‌పూరిత‌మైన హామీల‌ను న‌మ్మిన ప్ర‌జ‌లు కాంగ్రెస్ పార్టీకి అధికారాన్ని క‌ట్ట‌బెట్టారు. అనంత‌రం సీఎం ప‌ద‌వీని చేప‌ట్టిన రేవంత్ రెడ్డి ఇచ్చిన హామీల‌ను అమ‌లు చేయ‌మంటే.. రాష్ట్ర ఖ‌జానాలో లంకెబిందెల‌కు బ‌దులు మ‌ట్టి కుండ‌లున్నాయంటూ వ్యంగ్యంగా మాట్లాడి.. హామీల అమ‌లు నుంచి త‌ప్పించుకునే ప్ర‌య‌త్నం చేస్తున్నారు. మ‌రోవైపు ఇటీవ‌ల ఓ స‌భ‌లో సోనియాగాంధీ, రాహుల్ గాంధీకి, కాంగ్రెస్ పార్టీకి అవ‌స‌రం అయితే రూ.1000 కోట్లు ఇవ్వ‌డానికి సిద్ధంగా ఉన్నామ‌ని చెప్పిన విష‌యం వైర‌ల్ అయింది. దీనిని బ‌ట్టి రాష్ట్ర ఖ‌జానా నిల్-కాంగ్రెస్ నాయ‌కుల జేబులు ఫుల్ అన్న విష‌యం స్ప‌ష్టంగా అర్థం అవుతుంద‌ని కిష‌న్ రెడ్డి పేర్కొన్నారు.

Also Read : TTD: టీటీడీ చైర్మన్ గా బాలినేని శ్రీనివాసరెడ్డి ?