MINISTER SITAKKA : మంత్రి సీతక్క ఇలాకాలో రైతుల భూములను లాక్కుంటున్నఫారెస్ట్ అధికారులు

MINISTER SITAKKA : తెలంగాణ‌లో ఎక్క‌డ ఏం జ‌రుగుతుందో అస్స‌లు ఊహించ‌లేక‌పోతున్నాం. ఇటీవ‌ల ఖ‌మ్మం జిల్లా వెలుగుమ‌ట్ల‌లో పేద‌ల ఇళ్లు నేల‌మ‌ట్టం చేయ‌డంతో వాళ్లు అవ‌స్థ‌లు ప‌డుతున్న హృద‌య విదార‌క‌ర దృశ్యాలు మ‌నం చూశాం. అధికారంలోకి రాక ముందు ఒక మాట‌.. అధికారంలోకి వ‌చ్చిన త‌రువాత మ‌రోమాట అంటూ పేద ప్ర‌జ‌లు ప్ర‌భుత్వం పై మండిప‌డిన విష‌యం తెలిసిందే. MINISTER SITAKKA

MINISTER SITAKKA IS THE FOREST OFFICIALS GRABBING FARMERS LANDS IN ILAKA

తాజాగా మ‌రో ఘ‌ట‌న వెలుగులోకి వ‌చ్చింది. మంత్రి సీతక్క ఇలాకాలో రైతుల భూములను లాక్కుంటున్నారు అటవీ శాఖ అధికారులు. ములుగు జిల్లా తాడ్వాయి మండలం కాల్వపల్లిలో 25 ఏళ్లుగా సాగు చేసుకుంటున్న పోడు భూములను అటవీ శాఖ అధికారులు లాక్కుంటున్నారు. ముఖ్యంగా జేసీబీలతో కందకాలు తవ్వే ప్రయత్నం చేస్తున్న‌ అధికారులను రైతులు అడ్డుకుంటున్నారు. సాగు చేసుకుంటూ బ్రతుకుతున్నామని, తమ జీవనాధారమైన భూములను లాక్కోవద్దని రైతుల ఆందోళన చేప‌డుతున్నారు.

Also Read : GEETHIKA VEDHANA BOOK : ‘వేద‌న’ పేరుతో పుస్త‌కం రాసిన టెన్త్ విద్యార్థిని.. ప్ర‌భుత్వ కీల‌క నిర్ణ‌యం

ఈ క్ర‌మంలోనే ఫారెస్ట్ అధికారుల‌కు రైతుల‌కు వాగ్వాదం చోటు చేసుకుంది. మేము ఏళ్ల త‌ర‌బ‌డి భూమిని సాగుచేసుకొని జీవిస్తుంటే.. ఇవాళ మా భూముల వ‌ద్ద‌కు వ‌చ్చి మమ్ముల్నీ ఇబ్బందులు పెడుతున్నార‌ని అధికారుల‌పై మండిప‌డుతున్నారు. పేద‌లు ఎక్క‌డుంటే అక్క‌డే ప్ర‌భుత్వ అధికారులు వాలుతున్నార‌ని.. ధ‌నికుల వ‌ద్ద‌కు పోయి వాళ్ల‌ను ఎందుకు నిల‌దీయ‌డం లేద‌ని ప్ర‌జ‌లు ప్ర‌శ్నిస్తున్నారు.

Also Read : CM REVANTH REDDY : రాహుల్ గాంధీ ప్ర‌ధాని ప‌ద‌వీ పై సీఎం రేవంత్ రెడ్డి సెన్షేష‌న్ కామెంట్స్

Share your love