CM REVANTH REDDY : తెలంగాణ‌లో రైతుబంధు ర‌ద్దు.. అదొక చెత్త ప‌థ‌కం..!

Cm Revanth Reddy

CM REVANTH REDDY : తెలంగాణ‌లో రాజ‌కీయాలు చాలా ర‌స‌వ‌త్త‌రంగా మారుతున్నాయి. గ‌త ప్ర‌భుత్వం ప్ర‌వేశ పెట్టిన ప‌థ‌కాలను ఈ ప్ర‌భుత్వం ర‌ద్దు చేయ‌డం, పేర్లు మార్చ‌డం వంటి చేస్తున్నారు. ఈ ప్ర‌భుత్వం ప్ర‌వేశ‌పెట్టిన ప‌థ‌కాలను రాబోయే ప్ర‌భుత్వం కూడా అలాగే చేస్తుండ‌టం ప‌రిపాటిగా మారింది. గ‌తంలో బీఆర్ఎస్ ప్ర‌భుత్వం ఏర్పాటు చేసిన రైతు బంధు ప‌థ‌కాన్ని ప్ర‌స్తుత కాంగ్రెస్ ప్ర‌భుత్వం ర‌ద్దు చేయ‌నున్న‌ట్టు స‌మాచారం.

CM REVANTH REDDY COMMENTS ON CANCELLATION OF RYTHUBANDHU IN TELANGANA

ఇటీవ‌ల జ‌రిగిన క‌లెక్ట‌ర్ల స‌మావేశంలో సీఎం రేవంత్ రెడ్డి సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. కేసీఆర్ రైతు బంధు ప‌థ‌కంతో రైతుల‌ను సోమ‌రిపోతుల‌ను, తాగుబోతుల‌ను చేశాడ‌ని పేర్కొన్నారు. ఏడాదికి రూ.20వేల కోట్లు రైతు బంధు పై ప్ర‌భుత్వం ఖ‌ర్చు చేయ‌లేద‌ని.. ఇది దిక్కు మాలిన పథ‌కం అని, త్వ‌ర‌లోనే ర‌ద్దు చేస్తాన‌ని ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు సీఎం రేవంత్ రెడ్డి. రైతు బంధు ర‌ద్దు పై కోదండ‌రాం, మంత్రులు భ‌ట్టి విక్ర‌మార్క‌, తుమ్మ‌ల నాగేశ్వ‌ర‌రావుతో నూత‌న క‌మిటీ నియ‌మించ‌నున్న‌ట్టు తెలిపారు.

Also Read : CM REVANTH REDDY : లొంగిపోనున్న 124 మంది మావోయిస్టులు.. సీఎం రేవంత్ రెడ్డి ప్రెస్ మీట్..!

త‌న సొంత ఊరిలో రైతుబంధు వ‌ద్దు అని త‌న‌కు వినతి ప‌త్రాలు అంద‌జేశార‌ని సీఎం రేవంత్ రెడ్డి సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. రైతు బంధు ప‌థ‌కానికి బ‌దులుగా పంట‌కు బోన‌స్ ఇచ్చే విధంగా కొత్త ప‌థ‌కాన్ని తీసుకొస్తామ‌ని హామీ ఇచ్చారు సీఎం రేవంత్ రెడ్డి. యూరియా కొర‌త పై స్పందిస్తూ.. అలాంటిది ఏమి లేద‌ని.. అవ‌న్ని బీఆర్ఎస్ డ్రామాలు అని కొట్టి పారేశారు. మ‌రోవైపు శాస‌న మండ‌లిలో మాత్రం ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజ్ గోపాల్ రెడ్డి పేద ప్ర‌జ‌లంద‌రికీ రైతుబంధు ఇవ్వాల‌ని మాట్లాడుతున్న వీడియో వైర‌ల్ గా మారుతోంది.

Also Read : VIJAY THALAPATHY : విజ‌య్ ద‌ళ‌ప‌తికి మ‌రో షాక్ ఇచ్చిన భార్య సంగీత

Share your love
PakkaFilmy Telugu

PakkaFilmy Telugu

PakkaFilmy Telugu తెలుగు రాష్ట్రాల్లో సినిమా, రాజకీయాలు మరియు ట్రెండింగ్ వార్తలను అందించే ఒక డిజిటల్ న్యూస్ డెస్క్. మా ఎడిటోరియల్ టీమ్ ప్రతిరోజూ అందుబాటులో ఉన్న సోర్సుల నుండి సమాచారాన్ని సేకరించి, తెలుగు పాఠకుల కోసం సులభమైన భాషలో వార్తలుగా అందిస్తుంది. మమ్మల్ని ఇక్కడ కూడా ఫాలో అవ్వండి — X (Twitter): https://x.com/pakkafilmy007 | Telegram: https://t.me/pakkafilmytelugu | Instagram: https://instagram.com/pakkafilmy_