MINISTER KONDA SUREKHA : కాంగ్రెస్ ఎమ్మెల్యే పై మంత్రి కొండా సురేఖ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు

Minister Konda surekha
Konda surekha
Konda surekha

MINISTER KONDA SUREKHA : దేవాదాయ‌, అట‌వీ, ప‌ర్యావ‌ర‌ణ శాఖ‌ల మంత్రి కొండా సురేఖ నిత్యం ఈ మ‌ధ్య వార్త‌ల్లో నిలుస్తుండ‌టం విశేషం. సొంత పార్టీ నేత‌ల‌పై విమ‌ర్శ‌న అస్త్రాలు సంధించే కొండా సురేఖ‌.. ఈ సారి ఎమ్మెల్యే రేవూరి ప్ర‌కాశ్ రెడ్డి పై సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. కాంగ్రెస్ పార్టీలో చేరిక‌ల సంద‌ర్భంగా మాట్లాడిన మంత్రి.. కొన్నినియోజ‌క‌వ‌ర్గాల్లో వాళ్ల నీడను కూడా వాళ్ళు నమ్మలేని పరిస్థితి ఉంది.. వాళ్ళు పని చేయరు ఇంకొకరిని చేయనివ్వరు. దాని వల్ల మనకి వాళ్ల దగ్గరకి వెళ్ల‌బుద్ది కాదు అని సంచ‌ల‌న కామెంట్స్ చేశారు. MINISTER KONDA SUREKHA

MINISTER KONDA SUREKHA COMMENTS ON CONGRESS MLA REVURU PRAKASH REDDY

దీంతో వాళ్ల వ‌ల్ల పార్టీ న‌ష్ట‌పోతుంద‌ని.. ప్ర‌జ‌లు కూడా న‌ష్ట‌పోతార‌ని మంత్రి కొండా సురేఖ పేర్కొన్నారు. ఎమ్మెల్యే రేవూరి ప్రకాశ్ రెడ్డిని పరోక్షంగా విమర్శించారు. సొంత పార్టీ ఎమ్మెల్యే రేవూరి ప్ర‌కాశ్ రెడ్డి తీరును త‌ప్పు ప‌ట్టి మంత్రి సురేఖ‌.. ఆయ‌న‌తో అటు కాంగ్రెస్ పార్టీకి, ఇటు ప్ర‌జ‌ల‌కు చాలా న‌ష్టం వాటిల్లుతుంద‌ని పేర్కొన్నారు.

Also Read : HARISH RAO : తెలంగాణ ప్రభుత్వం కేరళలో యాడ్స్ ఇవ్వడంపై హరీష్ రావు ఫైర్..!

కేవ‌లం సొంత పార్టీ నేత‌ల‌పైనే కాదు.. గ‌తంలో కూడా ప‌లు సంద‌ర్భాల్లో ప‌లువురు ప్ర‌ముఖుల‌ను కూడా విమ‌ర్శించింది. న‌టుడు నాగార్జున కుటుంబం.. సమంత కుటుంబం పై అప్ప‌ట్లో పెను సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు కొండా సురేఖ‌. ఆ విష‌యం కోర్టు వ‌ర‌కు వెళ్లిన విష‌యం తెలిసిందే. ఇంకా చాలా మంది కొండా సురేఖ పై మండిప‌డుతున్నారు.


Also Read : CM REVANTH REDDY : అల్లు శిరీష్ పెళ్లికి హాజ‌రైన సీఎం రేవంత్ రెడ్డి

Share your love
PakkaFilmy Telugu

PakkaFilmy Telugu

PakkaFilmy Telugu తెలుగు రాష్ట్రాల్లో సినిమా, రాజకీయాలు మరియు ట్రెండింగ్ వార్తలను అందించే ఒక డిజిటల్ న్యూస్ డెస్క్. మా ఎడిటోరియల్ టీమ్ ప్రతిరోజూ అందుబాటులో ఉన్న సోర్సుల నుండి సమాచారాన్ని సేకరించి, తెలుగు పాఠకుల కోసం సులభమైన భాషలో వార్తలుగా అందిస్తుంది. మమ్మల్ని ఇక్కడ కూడా ఫాలో అవ్వండి — X (Twitter): https://x.com/pakkafilmy007 | Telegram: https://t.me/pakkafilmytelugu | Instagram: https://instagram.com/pakkafilmy_