Korean Kanakaraju: ఆగస్ట్ 7న విడుదలకు ఫిక్స్ అయిన వరుణ్ తేజ్ హారర్ కామెడీ

వరుణ్ తేజ్ నటిస్తున్న కొత్త హారర్ కామెడీ ‘కొరియన్ కనకరాజు’ ఆగస్ట్ 7న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదల కానుంది. ఈ సినిమా టాలీవుడ్ లోనే సరికొత్త ఇండో-కొరియన్ కాన్సెప్ట్ తో రూపొందింది. మేకర్స్ ఈ రిలీజ్ డేట్ ను సోషల్ మీడియాలో అధికారికంగా ప్రకటించడంతో ఫ్యాన్స్ హడావిడిగా షేర్ చేస్తున్నారు.

మేర్లపాక గాంధీ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో వరుణ్ తేజ్ సరసన రితికా నాయక్ హీరోయిన్ గా నటిస్తోంది. అలాగే స్టార్ కామెడియన్ సత్య కీలక పాత్రలో ప్రేక్షకులను నవ్వించడానికి రెడీ అయ్యారు. సంగీత దర్శకుడు ఎస్.ఎస్. తమన్ ఈ చిత్రానికి బ్యాక్ గ్రౌండ్ స్కోర్ అందించారు. ఈ భారీ ప్రాజెక్ట్ ను యూవీ క్రియేషన్స్, ఫస్ట్ ఫ్రేమ్ ఎంటర్ టైన్ మెంట్స్ మరియు టి-సిరీస్ సౌత్ బ్యానర్లపై రాజీవ్ రెడ్డి, వంశీ, మనోజ్ రెడ్డి నిర్మిస్తున్నారు.

కొరియన్ కల్చర్ మరియు లోకల్ కామెడీ కాంబినేషన్ ఈ సినిమాకు ప్రత్యేకత. హారర్ ఎలిమెంట్స్ తో కూడిన ఈ కామెడీ థ్రిల్లర్ ప్రేక్షకులకు కొత్త థియేట్రికల్ ఎక్స్ పీరియన్స్ ను ఇస్తుందని మేకర్స్ కాన్ఫిడెంట్ గా చెబుతున్నారు. ఇప్పటికే ‘కనకరాజు వచ్చేస్తున్నాడమ్మీ’ అనే ట్యాగ్ లైన్ తో ఈ అప్ డేట్ నెట్టింట వైరల్ అవుతోంది.

వరుణ్ తేజ్ కెరీర్ లో ఇది అత్యంత క్రేజీ మరియు వైల్డ్ రైడ్ గా నిలుస్తుందని నమ్మకంగా చెబుతున్నారు. సత్య జి. ఎడిటర్ గా, మనోజ్ రెడ్డి సినిమాటోగ్రఫీ అందిస్తున్నారు. అలాగే స్టార్ క్రిష్ జగర్లమూడి డైరెక్టర్ గా భాగస్వామిగా ఈ ప్రాజెక్ట్ లో పాలుపంచుకుంటున్నారు. మరి ఆగస్ట్ 7న థియేటర్లలో సందడి చేయబోతున్న ఈ కొరియన్ కనకరాజు బాక్సాఫీస్ వద్ద ఎలాంటి వండర్స్ క్రియేట్ చేస్తాడో చూడాలి.

Share your love