Dalmiya Cement: రాయలసీమలో రూ.3,100 కోట్ల పెట్టుబడి, 700 ఉద్యోగాలు

రాయలసీమలో మళ్ళీ పెద్ద ఇన్వెస్ట్మెంట్ వార్త వినిపిస్తోంది. దాల్మియా సిమెంట్ కంపెనీ రూ.3,100 కోట్లతో కొత్త ప్రాజెక్ట్ కు శ్రీకారం చుడుతోంది. దీని వల్ల ఏడాదికి 700 మందికి పైగా డైరెక్ట్ జాబ్స్ వస్తాయి. ఈ ప్రాజెక్ట్ కడప జిల్లా జమ్మలమడుగు ఏరియాలో సెట్ అవుతుంది.

Rayalaseema Investment by Dalmiya

ప్రస్తుతం అక్కడున్న ప్లాంట్ లో 950 మంది వర్క్ చేస్తున్నారు. కొత్తగా ఎక్స్పాన్షన్ పూర్తయితే మొత్తం 1,650 మందికి ఉపాధి దొరుకుతుంది. దీంతో అనుబంధ పరిశ్రమల్లోనూ మరిన్ని అవకాశాలు తలెత్తుతాయి. ఈ ప్లాంట్ ఏడాదికి 2.5 మిలియన్ టన్నుల క్లింకర్ మరియు 3.6 మిలియన్ టన్నుల సిమెంట్ ప్రొడ్యూస్ చేస్తుంది.

కంపెనీ 80% ఎలక్ట్రిసిటీ ని రెన్యువబుల్ సోర్సెస్ నుంచి తీసుకోవడానికి ప్లాన్ చేస్తోంది. అంటే ఇది ఓ గ్రీన్ ఇండస్ట్రీ గా మారే అవకాశం ఉంది. ప్రస్తుతం ఈ కంపెనీ రాష్ట్ర ప్రభుత్వానికి ఏడాదికి రూ.102 కోట్లు ట్యాక్సెస్ మరియు మైనింగ్ రాయల్టీలు కడుతోంది.

కొత్త ఎక్స్పాన్షన్ అయితే ఈ మొత్తం రూ.325 కోట్లకు పెరుగుతుంది. ఈ మొత్తం ప్రాంతీయ ఎకానమీకి బూస్ట్ గా మారుతుంది. రాయలసీమలో పెట్టుబడుల ట్రెండ్ కి ఇది మంచి సంకేతం.

Share your love