RAW NTR: ఎన్టీఆర్ పేరుతో వందకోట్ల స్కామ్ – పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు!!

యంగ్ హీరో జూనియర్ ఎన్టీఆర్ పేరుతో వంద కోట్ల రూపాయల స్కామ్ జరిగినట్టు పోలీస్ ఫిర్యాదు వచ్చింది. RAW NTR అనే ఫ్యాన్ గ్రూప్ ఎన్టీఆర్ పేరును వాడుకుంటూ డబ్బు వసూలు చేస్తున్నట్టు ఆరోపణలు వచ్చాయి. దీంతో ఎన్టీఆర్ ఫ్యాన్స్ రెండు గ్రూపులుగా చీలిపోయి సోషల్ మీడియాలో తీవ్రమైన వాగ్వాదానికి దిగారు. ఎన్టీఆర్ టీమ్ స్పష్టంగా చెప్పింది – వీళ్లతో మాకు ఎలాంటి సంబంధం లేదని.

RAW NTR ఫ్యాన్ గ్రూప్ కాంట్రవర్సీ

తిరుపతిలో ఈ RAW NTR సంస్థ ఓ ఈవెంట్ ప్లాన్ చేసింది. ఎన్టీఆర్ స్వయంగా వస్తారని, వంద కోట్లతో సేవా కార్యక్రమాలు చేస్తామని సోషల్ మీడియాలో ప్రచారం పెట్టారు. కానీ నిజానికి ఇది పొలిటికల్ మీటింగ్ కాదు అని ఎన్టీఆర్ టీమ్ క్లారిఫికేషన్ ఇచ్చింది. దీంతో ఫ్యాన్స్ కోపంగా ఉన్నారు.

ఎన్టీఆర్ పర్సనల్ PR రిలీజ్ చేసిన లెటర్లో మేం రా ఎన్టీఆర్ సంస్థను గుర్తించం, వాళ్లు ఎవరో మాకు తెలియదు అని స్పష్టం చేశారు. అయితే RAW NTR వాళ్లు మాత్రం మేం ఏడేళ్లుగా సేవా కార్యక్రమాలు చేస్తున్నాం, ఎన్టీఆర్ స్వయంగా ఫోన్ చేస్తే ఆపేస్తాం అని కౌంటర్ ఇచ్చారు.

పరిస్థితి ఇలా ఉండటంతో ఎన్టీఆర్ నిజమైన అభిమానులు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. ఎన్టీఆర్ పేరును దుర్వినియోగం చేసి మమ్మల్ని నమ్మించి డబ్బు వసూలు చేశారు అంటూ తిరుపతి పోలీసులకు ఫిర్యాదు ఇచ్చారు. మొత్తానికి ఈ గొడవ వల్ల ఎన్టీఆర్ పేరు బ్యాడ్ అవుతుందని ఫ్యాన్స్ ఆందోళన చెందుతున్నారు.

Share your love