ICC New Format: వన్డే వరల్డ్‌కప్‌కు భారీ మార్పులు.. కొత్త ఫార్మాట్‌తో ఐసీసీ కీలక నిర్ణయం!!

అంతర్జాతీయ క్రికెట్ మండలి (ICC) వన్డే ప్రపంచకప్‌కు కొత్త ఫార్మాట్‌ని తీసుకొస్తూ క్రికెట్ ప్రియులను ఆశ్చర్యపరిచింది. స్కాట్లాండ్‌లోని ఎడిన్‌బర్గ్‌లో జరిగిన వార్షిక సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నారు. ప్రతి మ్యాచ్‌కీ Importance పెంచడం, జట్ల మధ్య పోటీని మరింత ఆసక్తికరంగా మార్చడం ఈ మార్పుల ముఖ్య ఉద్దేశం. అభిమానులకు మరింత థ్రిల్లింగ్ అనుభవాన్ని అందించాలని ICC భావిస్తోంది. 2027లో జరిగే వరల్డ్ కప్‌లో మొత్తం 14 జట్లు పాల్గొంటాయి. గత రెండు ఎడిషన్లలో కేవలం 10 టీమ్‌లు మాత్రమే ఆడాయి. ఇప్పుడు మళ్ళీ పాత ఫార్మాట్‌కి తిరిగి వెళ్తున్నారు.

ODI World Cup New Format Changes

కొత్త ఫార్మాట్ ప్రకారం, టోర్నీని నాలుగు దశల్లో నిర్వహిస్తారు. మొదటి దశలో ర్యాంకింగ్స్‌లో 12, 13, 14 స్థానాల్లో ఉన్న మూడు దేశాలు పోటీపడతాయి. ఇందులో అగ్రస్థానంలో నిలిచిన టీమ్ రెండో దశకు అర్హత సాధిస్తుంది. రెండో దశలో అర్హత పొందిన 11 జట్లతో కలిసి మొత్తం 12 టీమ్‌లను రెండు గ్రూపులుగా విభజిస్తారు. ప్రతి గ్రూప్‌లో ఆరు జట్లు ఉంటాయి. ఒక్కో గ్రూప్‌లో మొదటి మూడు స్థానాల్లో నిలిచిన జట్లు, రెండు గ్రూపుల్లో నాలుగో స్థానంలో ఉన్న జట్లలో బెస్ట్ పెర్ఫార్మెన్స్ కనబరిచిన ఒక టీమ్ సూపర్-7 రౌండ్‌కు చేరుతాయి. ఇది గతంలో ఉన్న సూపర్-6 స్థానంలో వచ్చిన మార్పు.

సూపర్-7 రౌండ్‌లో ఏడు జట్లు ఒకదానితో ఒకటి తలపడతాయి. ఒకే గ్రూప్ నుంచి వచ్చిన జట్లు కూడా మళ్ళీ ఢీకొనే Chance ఉంటుంది. ఉదాహరణకు భారత్, పాకిస్థాన్ ఒకే గ్రూప్ నుంచి సూపర్-7కు చేరితే మరోసారి వారి మధ్య మ్యాచ్ జరుగుతుంది. సూపర్-7లో మొదటి నాలుగు స్థానాల్లో నిలిచిన టీమ్‌లు సెమీస్‌కు వెళ్తాయి. అక్కడ 1వ vs 4వ స్థానం, 2వ vs 3వ స్థానం మధ్య పోరు ఉంటుంది. ఈ కొత్త వన్డే ప్రపంచకప్ ఫార్మాట్‌తో మొత్తం 54 మ్యాచ్‌లు జరుగుతాయి. ఇది 2023లో జరిగిన మ్యాచ్‌ల కంటే తొమ్మిది ఎక్కువ.

టీ20 ప్రపంచకప్‌లో కూడా భారీ మార్పులు వచ్చాయి. మొత్తం 20 జట్లను ఐదు గ్రూపులుగా విభజిస్తారు. ప్రతి గ్రూప్‌లో నాలుగు టీమ్‌లు ఉంటాయి. గతంలో నాలుగు గ్రూపులు, ఒక్కో గ్రూప్‌లో ఐదేసి జట్లు ఉండేవి. ఇప్పుడు ప్రతి గ్రూప్ నుంచి టాప్ రెండు జట్లు తదుపరి దశకు చేరతాయి. సూపర్-8 స్థానంలో ఇప్పుడు సూపర్-10 రౌండ్ వస్తుంది. 10 జట్లను రెండు గ్రూపులుగా విభజించి, ఒక్కో గ్రూప్‌లో ఐదు టీమ్‌లు ఉంటాయి. ప్రతి గ్రూప్‌లో మొదటి స్థానంలో నిలిచిన జట్టు నేరుగా సెమీఫైనల్‌కు చేరుతుంది. రెండో, మూడో స్థానాల్లో ఉన్న జట్లు IPL తరహాలో ఎలిమినేటర్ మ్యాచ్‌లు ఆడతాయి. వాటిలో గెలిచిన రెండు టీమ్‌లు సెమీస్‌కు వెళ్తాయి. 2028 టీ20 ప్రపంచకప్ కోసం క్వాలిఫికేషన్ విధానంలో కూడా మార్పులు చేశారు.

Share your love