మన దేశంలో మొట్టమొదటి గ్రీన్ హైడ్రోజన్ రైలు సిద్ధంగా ఉంది. ఈ విషయంలో కాంగ్రెస్ పార్టీ చేయలేని పనిని ప్రధాని నరేంద్ర మోదీ చేసి చూపించారు. 2004 నుంచి 2014 వరకు అధికారంలో ఉన్న కాంగ్రెస్ హైడ్రోజన్ రైలు తీసుకురావాలనుకుంది కానీ అది కార్యరూపం దాల్చలేదు. కానీ మోదీ సర్కారు కేవలం ఐదేళ్లలోనే ఈ dream ను నిజం చేసింది. శుక్రవారం హరియాణాలోని జింద్-సోనిపట్ మధ్య ఈ రైలు ప్రయాణించనుంది. ఇది పూర్తిగా స్వదేశీ technology తో నిర్మించడం విశేషం.
Green Hydrogen Train Amazing Success
ఈ రైలు వల్ల పర్యావరణానికి ఎలాంటి హానీ లేదు. డీజిల్, బొగ్గు వాడకం తగ్గించి పునరుత్పాదక ఇంధనంతో తయారైన హైడ్రోజన్ ను fuel గా వాడుతారు. దీనివల్ల కర్బన ఉద్గారాలు పూర్తిగా ఉండవు. ఈ రైలు గంటకు 110 కిలోమీటర్ల వేగంతో ప్రయాణించగలదు. మొత్తం పది బోగీలతో నిర్మించిన ఈ రైలుకు కేంద్ర ప్రభుత్వం 136 కోట్ల రూపాయలు ఖర్చు చేసింది. ఆసక్తికరమైన విషయం ఏంటంటే దీన్ని హైదరాబాద్ కు చెందిన సంస్థ నిర్మించింది.
ప్రపంచంలో ఇప్పటివరకు జర్మనీ, జపాన్, చైనా లాంటి అభివృద్ధి చెందిన దేశాల్లో మాత్రమే హైడ్రోజన్ రైళ్లు ఉన్నాయి. ఇప్పుడు మనదేశం కూడా ఆ లిస్టులో చేరింది. ఈ సాఫల్యం మోదీ నాయకత్వంలో సాధ్యమైందని బీజేపీ ప్రశంసలు కురిపిస్తోంది. కేంద్ర ప్రభుత్వం త్వరలోనే దేశవ్యాప్తంగా ఇలాంటి రైళ్లను ప్రవేశపెట్టాలని ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. ఇది పర్యావరణ పరిరక్షణకు పెద్ద ఊతం ఇస్తుంది.
2030 నాటికి కర్బన ఉద్గారాలను తగ్గించాలన్న ఐక్యరాజ్యసమితి లక్ష్యానికి ఇది అనుగుణంగా ఉంది. విద్యుత్ వాహనాలతో పాటు హరిత ఇంధన వాహనాలను ప్రోత్సహించడం ద్వారా పర్యావరణ పరిరక్షణకు కేంద్ర ప్రభుత్వం కంకణం కట్టుకుంది. మనదేశంలో రైల్వే అతి పెద్ద ప్రజా రవాణా వ్యవస్థ కాబట్టి ఇక్కడ ఈ మార్పు చాలా ప్రభావవంతంగా ఉంటుంది. ఈ నిర్ణయం వల్ల భవిష్యత్తు తరాలకు మంచి వాతావరణం అందించవచ్చు.





