Drugs Scandal: హైదరాబాద్ డ్రగ్స్ కుంభకోణం.. డ్రగ్స్ కేసులో ఎమ్మెల్సీ కొడుకు అరెస్ట్!!

హైదరాబాద్‌లో మరోసారి Drugs Scandal హైలైట్ అయింది. ఈసారి ఓ ఎమ్మెల్సీ కొడుకు డ్రగ్స్ కోసం ఎగబడి పోలీసులకు పట్టుబడ్డాడు. ఈగల్ టీం చేసిన ప్రత్యేక ఆపరేషన్‌లో ఈ ఘటన బయటపడింది. నగరంలో డ్రగ్స్ మహమ్మారి రోజురోజుకు పెరుగుతుండడం ఆందోళన కలిగిస్తోంది. ప్రజాప్రతినిధుల కుటుంబాల వాళ్లు కూడా ఈ వ్యవహారంలో చిక్కుతుండడం రాజకీయంగా కలకలం రేపింది.

Drugs Scandal: MLC son caught in eagle team raid

మంగల్ హాట్ ప్రాంతంలో ఇటీవల డ్రగ్స్ రవాణా, వినియోగం బాగా పెరిగిపోయింది. దీంతో ఈగల్ సిబ్బంది అక్కడ నిఘా పెంచారు. బుధవారం అర్ధరాత్రి 1 గంట తర్వాత మారువేషాల్లో గస్తీ చేస్తూ కొంతమంది అనుమానితులను పట్టుకున్నారు. విచారణలో వాళ్లలో ఒక వ్యక్తి ఓ ప్రముఖ పార్టీకి చెందిన ఎమ్మెల్సీ కొడుకు అని తేలింది. ఈ విషయం తెలియగానే పోలీసులు షాక్ అయ్యారు.

వెంటనే వీరికి medical tests చేశారు. blood samples తీసి పరీక్షకు పంపించారు. అయితే ఈ డ్రగ్స్ కేసుకు సంబంధించిన పూర్తి వివరాలను పోలీసులు గోప్యంగా ఉంచారు. ఏ పార్టీకి చెందిన వ్యక్తి అనే విషయం కూడా క్లారిటీ లేదు. ఇది స్థానికంగా పెద్ద సంచలనం సృష్టించింది.

రాజకీయంగా ఈ డ్రగ్స్ స్కాండల్ మరింత వేడి పుట్టిస్తోంది. అటు కాంగ్రెస్, ఇటు బీఆర్ఎస్ నేతలు ఫోన్లు చేసి సంబంధిత వ్యక్తి ఎవరో తెలుసుకోవడానికి ప్రయత్నిస్తున్నారు. ఇప్పటికే పలువురు ప్రజాప్రతినిధులు, వారి సన్నిహితులు డ్రగ్స్ కేసుల్లో చిక్కిన సంగతి తెలిసిందే. తాజా ఘటనతో ఈ డ్రగ్స్ సమస్య మరింత తీవ్రమైంది.

Share your love