IBomma: ఐ బొమ్మ నిర్వాహకుడిని భార్యే దగ్గరుండి పట్టించిందా.?

The IBomma manager was caught by his wife

IBomma: సాధారణంగా ఒక సినిమా తీయాలంటే మామూలు విషయం కాదు.. దాని వెనుక కోట్లాది రూపాయల డబ్బు ఖర్చుతో పాటు ఎంతో మంది కృషి ఉంటుంది.. అలా కష్టపడి తీసిన సినిమా సక్సెస్ అయితేనే వీళ్లంతా బ్రతుకుతారు.. అలా ఒక సినిమా రిలీజ్ అయింది అంటే దర్శక నిర్మాతలతో పాటు అందులో నటించిన నటీనటులు కెమెరామెన్ లు ఇతర పనులు చేసేవారు చివరికి లైట్ బాయ్స్ నుంచి మొదలు వేలాదిమందికి ఉపాధి దొరుకుతుంది.

The IBomma manager was caught by his wife

అలా సినిమాలు సక్సెస్ అయితేనే మరో సినిమా తీస్తారు నిర్మాతలు.. అలా ఎంతో కష్టపడి సినిమా తీస్తే కొంతమంది వ్యక్తులు పైరసీ చేసి, సినీ ఇండస్ట్రీలోని నిర్మాతలను లాస్ చేస్తున్నారు. ముఖ్యంగా తెలుగు సినిమాలను ఎక్కువగా పైరసీ చేసే సంస్థల్లో ఐ బొమ్మ కీలక పాత్ర పోషిస్తుంది. ఐ బొమ్మ అనే సైట్ ద్వారా కోట్లాది రూపాయలు పెట్టి సినిమా తీసిన నిర్మాతలను చాలామంది థియేటర్ లకి రాకపోగా ఈ సైట్ ద్వారా సినిమాలు చూసి ఇండస్ట్రీని నష్టాలపాలు చేస్తున్నారు. (IBomma)

Also Read: Rashmika: అందుకే నేను రాను.. వస్తే ఇలా చేస్తారు.. రష్మిక అసహనానికి కారణం..!

దీంతో ఐ బొమ్మ సంస్థపై గత కొంతకాలంగా ఇండస్ట్రీ పెద్దలు సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. కానీ సంస్థను నడిపిస్తున్నటువంటి రవిని మాత్రం పట్టుకోలేక పోయారు. అలాంటి ఈయన తాజాగా సైబర్ క్రైమ్ పోలీసులకు దొరికినట్టు తెలుస్తోంది. వైజాగ్ ప్రాంతానికి చెందినటువంటి రవి హైదరాబాదులోని కూకట్పల్లిలో అపార్ట్మెంట్లో నివసిస్తాడు. అయితే రవికి తన భార్యతో విభేదాలు ఉన్న కారణంగా విడాకులకు అప్లై చేశారు.. అయితే విదేశాల్లో నివసిస్తున్నటువంటి రవి తన భార్యతో విడాకులు తీసుకునేందుకు తాజాగా హైదరాబాద్ చేరుకున్నారు.

The IBomma manager was caught by his wife

దీంతో తన భార్య పోలీసులకు సమాచారం అందించడంతో సైబర్ క్రైమ్ పోలీసులు కాపుగాసి రవిని పట్టుకున్నారు. ఆయన నుంచి కొన్ని హార్డు డిస్కులు, కంప్యూటర్లను పోలీసులు స్వాధీనం చేసుకొని అదుపులోకి తీసుకున్నారు. రవి గత కొంతకాలంగా ఐ బొమ్మ సైట్ నడిపిస్తూ సినిమా ఇండస్ట్రీకి కోట్లాది రూపాయల నష్టం తీసుకువచ్చారు.మరి ఈయనపై కోర్టు ఏ విధంగా చర్యలు తీసుకుంటుందనేది ముందు ముందు తెలియబోతోంది.(IBomma)

Share your love