Zero Tolerance: డ్రగ్స్‌పై జీరో టాలరెన్స్, విద్యాసంస్థల్లో కఠిన చర్యలు

DGP CV Anand

తెలంగాణ ప్రభుత్వం డ్రగ్స్‌పై జీరో టాలరెన్స్ policyని కచ్చితంగా అమలు చేయాలని నిర్ణయించింది. స్కూళ్ళు, కాలేజీలు, ఇతర విద్యా సంస్థల్లో డ్రగ్స్‌కు సంబంధించి ఎలాంటి వెసులుబాటు ఉండొద్దు అని DGP సీవీ ఆనంద్ స్పష్టం చేశారు. ఇప్పటికే ఈ విషయమై ఈగల్ అధికారులతో ఉన్నత స్థాయి review meeting నిర్వహించారు. డ్రగ్స్ వల్ల యువత చెడు దారికి వెళ్ళకుండా ఉండేలా క్యాంపస్ సేఫ్టీకి ప్రాధాన్యత ఇవ్వడం, ప్రతి సంస్థలో safety coordinator ను తప్పనిసరి చేయడం వంటి చర్యలు చేపట్టారు.

Drugs Control Campus Safety Update

ఈ meeting లో ఈగల్ టీమ్ ఇచ్చిన presentation ను DGP సీవీ ఆనంద్ పరిశీలించారు. అందులో డ్రగ్స్ కంట్రోల్ కోసం స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్స్ రూపకల్పనపై దృష్టి పెట్టారు. విద్య, ఆరోగ్య శాఖలతో సమన్వయం చేసుకుని సమర్థవంతమైన వ్యూహం రూపొందించాలని నిర్ణయించారు. ప్రతి విద్యా సంస్థలో యాంటీ డ్రగ్స్ కమిటీ ఏర్పాటు చేసి, కౌన్సెలింగ్ సేవలు అందుబాటులో ఉంచాలనేది ప్రధాన అజెండా. డ్రగ్స్ అమ్మకం లేదా వినియోగం కనిపిస్తే సంబంధిత సంస్థలపై కఠిన చర్యలు తీసుకుంటామని, అవసరమైతే recognition cancel చేసే అవకాశం ఉందని హెచ్చరించారు.

స్కూళ్ళు, కాలేజీల్లో admission సమయంలోనే స్టూడెంట్లకు డ్రగ్స్ ఎఫెక్ట్స్ గురించి అవగాహన కల్పించాలి. సైకాలజిస్టులు, కౌన్సెలర్ల సేవలు అందుబాటులో ఉంచాలని నిర్ణయించారు. పేరెంట్స్ ను కూడా ఈ కార్యక్రమం లో భాగస్వామ్యం చేయడం, ఎన్జీవోల సహకారంతో డ్రగ్స్ అవేర్నెస్ ప్రోగ్రామ్స్ నిర్వహించాలనేది మరో కీలక అంశం. ప్రతి స్టూడెంట్కు సేఫ్, హెల్తీ, drug free ఎడ్యుకేషన్ ఎన్విరాన్మెంట్ అందించడమే ప్రభుత్వ లక్ష్యం అని DGP సీవీ ఆనంద్ చెప్పారు.

ఈ meeting లో ఈగల్ డైరెక్టర్ సందీప్ శాండిల్య, ఐజీ పద్మజా రెడ్డి, ఎస్పీ గిరిధర్ సహా సీనియర్ అధికారులు పాల్గొన్నారు. చివరి proposal ను ప్రభుత్వానికి submit చేసే ముందు మరో సమీక్ష meeting పెట్టాలని నిర్ణయించారు. ఇలాంటి మీటింగ్స్ రెగ్యులర్ గా జరుగుతాయని అధికారులు తెలిపారు. యూత్ ను డ్రగ్స్ మాయ నుంచి కాపాడటానికి ప్రభుత్వం అన్ని efforts తీసుకుంటుందని స్పష్టం చేశారు.

Share your love
PakkaFilmy Telugu

PakkaFilmy Telugu