విజయ్ కుమారుడు జాసన్ సంజయ్ హీరో ఎంట్రీపై క్లారిటీ ఇచ్చాడు. ప్రస్తుతం ‘సిగ్మా’ సినిమాతో దర్శకుడిగా తన ప్రయాణాన్ని స్టార్ట్ చేసిన జాసన్, హీరోగా ఎప్పుడు ఎంటర్ అవుతాడనే ప్రచారం ఊపందుకుంది. ఈ విషయంపై తాజాగా ఆయన క్లారిటీ ఇచ్చారు. తన ఫుల్ ఫోకస్ ప్రస్తుతం ‘సిగ్మా’ డైరెక్షన్ మీదే ఉందని స్పష్టం చేశారు. ఆ తర్వాతే యాక్టింగ్ గురించి డిసైడ్ అవుతానన్నారు.
Jason Sanjay Hero Entry Plans
తనకు గతంలో ఒక యాక్టింగ్ ఆఫర్ కూడా వచ్చిందని జాసన్ సంజయ్ గుర్తు చేసుకున్నారు. కానీ ఆ టైమ్ లో తాను కెనడాలో ఫిల్మ్ మేకింగ్ కోర్సు చేస్తున్నానని, ఆ పాత్రకు బాగా సరిపోయే వేరే వాళ్లని తీసుకోమని సూచించానని చెప్పాడు. తన కుటుంబం నుంచి పూర్తి సపోర్ట్ ఉందని, ఇంట్లో అందరూ సానుకూలంగా స్పందించారని ఆయన తెలిపారు. ‘సిగ్మా’ సినిమా స్టార్ట్ అయినప్పుడు విజయ్ సేతుపతి గారితో సహా చాలామంది సెలబ్రెటీలు గ్రీటింగ్స్ చెప్పారు. ఆ encouragement తోనే తాను ముందుకు సాగుతున్నట్లు జాసన్ చెప్పాడు.
‘సిగ్మా’ సినిమా సెట్స్ లో సీన్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నప్పుడు తనలో ఒక యాక్టర్ కూడా ఉన్నట్లు ఫీల్ అయ్యానని జాసన్ అంటున్నాడు. ఐతే ప్రస్తుతం తన పూర్తి దృష్టి ఈ ప్రాజెక్ట్ పైనే ఉందట. ఈ సినిమా రిలీజయ్యాక తాను హీరోగా ట్రై చేయాలా లేక డైరెక్టర్ గా కంటిన్యూ అవ్వాలా అనే దానిపై నిర్ణయం తీసుకుంటానని క్లారిటీ ఇచ్చాడు. ఇది పూర్తిగా తన own decision అని, తండ్రి విజయ్ వారసత్వంతో కాకుండా తనకంటూ ఒక గుర్తింపు తెచ్చుకోవాలని ప్రయత్నిస్తున్నానని చెప్పాడు.
లైకా ప్రొడక్షన్స్ బ్యానర్ లో తెరకెక్కుతున్న ‘సిగ్మా’ మూవీ డిఫరెంట్ జానర్ లో ఉంటుందని టాక్. యువ డైరెక్టర్ గా జాసన్ సంజయ్ తీస్తున్న ఈ సినిమా స్టోరీ, విజువల్స్ ఎలా ఉంటాయో చూడాలని ఆడియెన్స్ పెద్ద ఎత్తున ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. తండ్రి లెవల్ ను టచ్ చేయడం కాకుండా, కొత్త ఐడెంటిటీని క్రియేట్ చేసుకోవాలని సంజయ్ ప్లాన్ చేస్తున్నాడు. ఈ ప్రాజెక్ట్ ద్వారా అతను ఎంత సక్సెస్ అవుతాడో చూడాలి.





