Aishwarya Lakshmi: వందకోట్లు ఇచ్చిన సోషల్ మీడియాకు దూరం, హ్యాపీగా ఉన్నా: ఐశ్వర్య లక్ష్మి

ఐశ్వర్య లక్ష్మి ప్రస్తుతం సోషల్ మీడియా మాయాజాలానికి పూర్తి గుడ్‌బై చెప్పేసి, తన సినీ కెరీర్‌పై ఫుల్ ఫోకస్ పెట్టింది. ఒకప్పుడు ఆన్‌లైన్‌లో యాక్టివ్‌గా ఉండే ఈ కేరళ బ్యూటీ, ఇప్పుడు ఆ ప్లాట్‌ఫామ్స్‌కు దూరంగా ఉండటమే తనకు ఎంతో మెంటల్ పీస్ ఇస్తోందని చెప్పుకొచ్చింది. ట్రోల్స్, మార్ఫింగ్ ఫోటోల వల్ల విసిగిపోయానని, అసలు వంద కోట్ల రూపాయలు ఇచ్చినా మళ్ళీ సోషల్ మీడియా వైపు కన్నెత్తి చూడనని ఓ ఇంటర్వ్యూలో తేల్చిపారేసింది.

Aishwarya Lakshmi Social Media Break

ఆ ఇంటర్వ్యూలో ఐశ్వర్య లక్ష్మి తన మనసులో మాట బయటపెట్టింది. “గతంలో నేను ఫేస్‌బుక్, ఇన్‌స్టాల్లో చాలా యాక్టివ్‌గా ఉండేదాన్ని. కానీ కొంతమంది నా పిక్స్‌ని ఎడిట్ చేసి, చాలా వల్గర్ కామెంట్లు పెట్టేవాళ్ళు. ఆ నెగెటివిటీ చూస్తే, ప్రపంచం మొత్తం నన్ను ద్వేషిస్తున్నట్టు ఫీలయ్యేది” అని తెలిపింది. అందుకే ఆ ప్లాట్‌ఫామ్స్‌కు దూరంగా జరిగి, నేరుగా ప్రేక్షకులతో కనెక్ట్ అవడం మొదలుపెట్టినట్టు చెప్పింది. ఈ డిజిటల్ డిటాక్స్ తనకు ఎంతో రిలీఫ్ ఇచ్చిందని, ఇప్పుడు లైఫ్ చాలా హ్యాపీగా ఉందని ఆమె నమ్మకంగా చెప్పింది.

ఇక తన లేటెస్ట్ మూవీ ‘గట్టాకుస్తీ 2’ గురించి మాట్లాడుతూ, ఆ సినిమా అచీవ్ చేసిన సక్సెస్ తనకు చాలా సంతోషాన్నిచ్చిందని ఆనందం వ్యక్తం చేసింది. “ఈ సినిమా జెండర్ ఈక్వాలిటీని చాలా బ్యూటిఫుల్‌గా ప్రెజెంట్ చేసింది. ఇలాంటి కథలు కమర్షియల్‌గా హిట్ కావడం నిజంగా గొప్ప విషయం” అంటూ ఐశ్వర్య లక్ష్మి పొగిడింది. ఇలాంటి పవర్‌ఫుల్ సబ్జెక్టులు చేస్తున్నప్పుడు, ఆడియెన్స్ నుంచి వచ్చే పాజిటివ్ రెస్పాన్స్ తనకు మరింత మోటివేషన్ ఇస్తుందని ఆమె అభిప్రాయపడింది.

ప్రస్తుతం ఈ మలయాళీ క్యూటీ చేతిలో సాలిడ్ ప్రాజెక్ట్స్ లైన్లో ఉన్నాయి. ఓ ఫీమేల్ సెంట్రిక్ సినిమాలో టఫ్ పోలీస్ ఆఫీసర్ పాత్రలో నటిస్తోంది. అది కాకుండా, ‘తీవియన్‌ పొట్రు’, ‘లవ్’ అనే డిజిటల్ సిరీస్‌లలోనూ ఈమె బిజీగా ఉంది. ఈ వెబ్ సిరీస్‌లతో ఓటీటీ ఆడియెన్స్‌కు మరింత దగ్గరవ్వనుంది. ఇవన్నీ కాకుండా, త్వరలోనే ఒక తెలుగు ప్రాజెక్ట్ తో టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇవ్వనుందనే రూమర్లు ఊపందుకుంటున్నాయి. ఐశ్వర్య లక్ష్మి కెరీర్ గ్రాఫ్ మాత్రం రోజురోజుకీ పైకే వెళ్తోంది.

Share your love