Manchu Lakshmi: ఇక సహించేదే లేదు.. రకుల్ కి స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చిన మంచు లక్ష్మి..ఏం జరిగిందంటే.?

Manchu Lakshmi gives a strong warning to Rakul

Manchu Lakshmi: మంచు లక్ష్మి రకుల్ ప్రీత్ సింగ్ ఎంత మంచి స్నేహితులో చెప్పనక్కర్లేదు. వీరిద్దరి మధ్య బాండింగ్ ఎప్పటినుండో కొనసాగుతోంది.అయితే అలాంటి ఈ స్నేహితుల మధ్య గొడవ ఎక్కడ మొదలైంది..ఎందుకు మంచు లక్ష్మి రకుల్ ప్రీత్ సింగ్ కి వార్నింగ్ ఇచ్చింది అనేది ఇప్పుడు చూద్దాం. రకుల్ ప్రీత్ సింగ్ తాజాగా దేదే ప్యార్ దే -2 అనే మూవీతో మన ముందుకు వచ్చిన సంగతి మనకు తెలిసిందే. ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద మిక్స్డ్ టాక్ తెచ్చుకుంది.

Manchu Lakshmi gives a strong warning to Rakul

అయితే ఒకప్పుడు టాలీవుడ్ లో వరుస సినిమాలు చేసిన రకుల్ ప్రస్తుతం ఇండస్ట్రీకి దూరంగా ఉన్న సంగతి మనకు తెలిసిందే. ఈ నేపథ్యంలోనే తాజాగా మంచు లక్ష్మి ఇంటర్వ్యూలో రకుల్ ని ఉద్దేశించి సంచలన వ్యాఖ్యలు చేసింది.మంచు లక్ష్మి మాట్లాడుతూ.. ఒకప్పుడు మేము హైదరాబాదులో చాలా బాగా కలిసి ఉండేవాళ్లం. కానీ ఇప్పుడు మా ఇద్దరి జీవితాల్లో మార్పు వచ్చింది. రకుల్ పెళ్లి చేసుకొని హ్యాపీగా గడుపుతుంది. నేను కూడా ముంబైకి మకాం మార్చాను.(Manchu Lakshmi)

Also Read: Manchu Lakshmi: ఇంట్లో వాళ్ళు లేరని చూసి మంచు లక్ష్మిని అసభ్యంగా తాకిన వ్యక్తి..!

నాకంటే ఎక్కువ రకుల్ లో చాలా మార్పు వచ్చింది. ఏ చిన్న ప్లాన్ గురించి చెప్పినా కూడా సరే నేను నా భర్తని అడిగి మళ్ళీ చెబుతాను అంటూ ఏ చిన్న విషయమైనా సరే జాకీ ని అడిగాకే నిర్ణయం తీసుకుంటుంది. అయితే కొత్తగా పెళ్లైన వారిలో సహజంగా ఇది కనిపిస్తుంది. ఏ విషయమైనా పదేపదే భర్తకి చెబుతామంటారు. కానీ ఇంకో సంవత్సరం పాటు వెయిట్ చేస్తాను.

Manchu Lakshmi gives a strong warning to Rakul

అంతే ఆ తర్వాత రకుల్ ని కచ్చితంగా కఠినంగా దండిస్తా..వార్నింగ్ కూడా ఇస్తా.. అంటూ సంచలన వ్యాఖ్యలు చేసింది మంచు లక్ష్మి.అయితే పెళ్లయ్యా చాలామంది ఏదైనా ప్లాన్ చేసుకునే ముందు భకర్తలకు చెబుతారు. అలా రకుల్ కూడా మంచు లక్ష్మి చెప్పిన ఏ ప్లాన్ కైనా సరే భర్తకి చెప్పి ఆయన పర్మిషన్ తీసుకుంటానని తప్పించుకోవడంతో మంచు లక్ష్మి రకుల్ ని ఉద్దేశించి ఈ కామెంట్లు చేసినట్టు తెలుస్తోంది.(Manchu Lakshmi)

Share your love