Manchu Lakshmi: ఫ్యామిలీ గొడవలపై మంచు లక్ష్మీ ఎమోషనల్.. ఆ దేవుడు కనిపిస్తే అదే కోరుకుంటా అంటూ.!

Manchu Lakshmi is emotional over family disputes

Manchu Lakshmi: మంచు మనోజ్ ఎప్పుడైతే మౌనికని రెండో పెళ్లి చేసుకున్నాడో అప్పటినుండి మంచు ఫ్యామిలీ లో విభేదాలు ఎక్కువయ్యాయి.ముఖ్యంగా మనోజ్ భూమా మౌనికని పెళ్లి చేసుకోవడం మోహన్ బాబు కి,విష్ణు కి,విష్ణు భార్యకి అస్సలు ఇష్టం లేదు.దాంతో మనోజ్ అక్క మంచు లక్ష్మి దగ్గరుండి తమ్ముడికి పెళ్లి చేసింది.పెళ్లి విషయంలో సొంత తల్లిలాగే వ్యవహరించింది.ఇక గత సంవత్సర కాలం నుండి మంచు ఫ్యామిలీలో విభేదాలు తారాస్థాయికి చేరుకున్నాయి.

Manchu Lakshmi is emotional over family disputes

ముఖ్యంగా ఒకరిపై ఒకరు మాటలు యుద్ధంతో పాటు చేతలు కూడా చేసుకోవడంతో వీరి ఫ్యామిలీ గొడవలు రోడ్డుకెక్కాయి. మీడియా కల్పించుకోవడం మీడియాపై మోహన్ బాబు గొడవకు దిగడం ఇలా ఎన్నో జరిగిపోయాయి. పోలీస్ స్టేషన్లు, కోర్టులు ఇలా ఎన్నో జరిగాక ఫైనల్ గా మంచు మోహన్ బాబు ఇండస్ట్రీకి వచ్చి 50 ఏళ్లు అయిన సందర్భంగా ఏర్పాటు చేసిన ఈవెంట్ కి కూడా చిన్న కొడుకుని ఆహ్వానించలేదు. (Manchu Lakshmi)

Also Read: Kushboo: ‘నీ మొహం కడుక్కో పో’ అంటూ కుష్బూని అవమానించిన కమల్ హాసన్.!

దీంతో మంచు ఫ్యామిలీ లో విభేదాలు ఏ రేంజ్ లో ఉన్నాయో అందరికీ అర్థమైంది.ఇదిలా ఉంటే తాజాగా మంచు లక్ష్మి తనకు ఆ దేవుడు ప్రత్యక్షమై వరం కోరుకోమంటే మళ్ళీ నా ఫ్యామిలీ ఎప్పటిలాగే కలిసి ఉండాలని కోరుకుంటానని, ఎన్ని జరిగినా కూడా చివరికి ఆపదలో తోడుండేది రక్తసంబంధీకులే అంటూ మంచు లక్ష్మి ఎమోషనల్ అయింది.

Manchu Lakshmi is emotional over family disputes

అలా మంచు లక్ష్మి చేసిన కామెంట్లు నెట్టింటా వైరల్ గా మారడంతో ఫ్యామిలీ విభేదాల విషయంలో మంచు లక్ష్మి ఎంత సఫర్ అవుతుందో ఈ ఒక్క విషయంతో అర్థం చేసుకోవచ్చు అంటూ కామెంట్లు పెడుతున్నారు. అలాగే మళ్ళీ అందరూ కలిసి పోయి మంచు ఫ్యామిలీ హ్యాపీగా ఉండాలని అభిమానులు కోరుకుంటున్నారు.(Manchu Lakshmi

Share your love