NBK 111 : షూటింగ్ లో బాలయ్య కు గాయం.. నెల రోజుల పాటు షూటింగ్ బంద్!!

Balakrishna looking intense

జూలై 21 నాడు కాకినాడలో జరిగిన NBK 111 సినిమా షూటింగ్ లో బాలకృష్ణ గాయపడిన విషయం తెలిసిందే. మంచు మనోజ్ తో కలిసి ఓ యాక్షన్ సీక్వెన్స్ షూట్ చేస్తున్న సమయంలో ఈ ఎక్సిడెంట్ జరిగింది. బాలయ్య మోకాలికి తీవ్రమైన గాయం అవడంతో వెంటనే స్థానిక ఆసుపత్రిలో ఫస్ట్ ఎయిడ్ చేసి, అనంతరం హైదరాబాద్‌కు తరలించారు.

NBK 111 షూట్ ఆపరేషన్ తర్వాత బంద్

ప్రస్తుతం బాలకృష్ణ హైదరాబాద్‌లోని గచ్చిబౌలి ఏఐజీ ఆసుపత్రిలో చేరారు. నేడు ఆయన మోకాలికి సర్జరీ జరగనుంది. డాక్టర్లు చెప్పినట్లుగా, ఆపరేషన్ తర్వాత బాలయ్యకు నాలుగైదు వారాల పాటు పూర్తి బెడ్ రెస్ట్ అవసరం. దీంతో సినిమా షూటింగ్ కి తాత్కాలికంగా బ్రేక్ పడింది.

బాలయ్య రికవరీ కోసం అభిమానులు, సెలబ్రిటీలు ప్రార్థిస్తున్నారు. ముందుగా దసరాకు రావాల్సిన NBK 111 సినిమా ఇప్పుడు ఆలస్యం అవుతున్నట్లు తెలుస్తుంది. బాలకృష్ణ నెల రోజుల్లో కోలుకుంటే, డిసెంబర్ లేదా సంక్రాంతి కానుకగా ఆ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది.

ప్రస్తుతం NBK 111 టీం ఆపరేషన్ అప్డేట్‌ను క్లోజ్‌గా ఫాలో అవుతోంది. బాలయ్య రికవరీ తర్వాత షూట్ మళ్లీ స్టార్ట్ అవుతుంది. ఇది నందమూరి అభిమానులకు ఓ షాకింగ్ న్యూస్ అయితే, బాలయ్య ఆరోగ్యం ప్రాధాన్యం అని అందరూ చెబుతున్నారు.

Share your love
PakkaFilmy Telugu

PakkaFilmy Telugu