Bed Room: ఈ వస్తువులను బెడ్ రూంలో పెడుతున్నారా…అయితే జాగ్ర‌త్త ?

Bed Room: బెడ్ రూమ్ లో చాలామంది కొన్ని రకాల వస్తువులను పెడుతూ ఉంటారు. తెలిసో తెలియకో ఇష్టం ఉన్న వస్తువులను పెట్టడం వల్ల కొన్ని రకాల పొరపాట్లు జరుగుతాయి. అయితే బెడ్ రూమ్ లో పొరపాటున కూడా కొన్ని రకాల వస్తువులను పెట్టకూడదని పండితులు చెబుతున్నారు. పొరపాటున ఈ వస్తువులను పెట్టినట్లయితే ఆరోగ్యంపై విపరీతంగా ప్రభావం పడుతుంది. ఆ వస్తువులు ఏంటో ఇప్పుడు చూద్దాం… బెడ్ రూమ్ లో మంచం ముందు ఎప్పుడు అద్దం నేరుగా ఉంచుకోకూడదు. నిద్రపోతున్న సమయంలో అద్దంలో చిత్రం ప్రతిబింబిస్తే అది ప్రతికూల శక్తులను ఆకర్షిస్తుంది. Bed Room

Do you keep these items in the Bed Room

ఇది నిద్ర సమస్యలు, మానసిక ఒత్తిడి, వైవాహిక సంబంధంలో అనేక రకాల విభేదాలను తీసుకువస్తుంది. ఒకవేళ కుదిరితే బెడ్ రూమ్ లో అద్దం తీసివేయాలి వీలు కానట్లయితే రాత్రి సమయంలో అద్దాన్ని ఒక బట్ట ముక్కతో పూర్తిగా కప్పి వేయాలి. బెడ్ రూమ్ లో ఎలక్ట్రానిక్ పరికరాలను పెట్టుకోకూడదు. టీవీ, లాప్టాప్, చార్జర్ లాంటి ఎలక్ట్రానిక్ ఐటమ్స్ లను బెడ్ రూమ్ లో పెట్టుకోకూడదు. ఇలాంటి వస్తువులను బెడ్ రూమ్ లో పెట్టుకున్నట్లయితే అవి విద్యుదయస్కాంత తరంగాలను రిలీజ్ చేస్తాయి. ఇవి ఆరోగ్యంపై ప్రతికూల ప్రభావాలను చూపుతాయి. సానుకూల శక్తులను దెబ్బతీస్తాయి. పొరపాటున కూడా బెడ్ రూమ్ లో ఎలక్ట్రానిక్ వస్తువులను పెట్టుకోకుండా ఉండడమే మంచిది. అవసరమైతే రాత్రి సమయంలో పడుకునే ముందు వాటిని ఆఫ్ చేసి మంచానికి దూరంగా ఎలక్ట్రానిక్ పరికరాలను పెట్టుకోవాలి. బెడ్ రూమ్ లో పాత బట్టలు, విరిగిపోయిన వస్తువులు, పగిలిపోయిన వస్తువులను ఉంచకూడదు. Bed Room

Also Read: Sana Mir Azad Kashmir: అజాద్ కశ్మీర్ వ్యాఖ్యలు.. సనా మిర్ వివాదం ఏంటీ…

బెడ్ రూమ్లో ఇలాంటి పనికిరాని వస్తువులను ఉంచుకోవడం వల్ల ప్రతికూల శక్తులు పెరుగుతాయి. వాస్తు ప్రకారం కొన్ని ఇలాంటి వస్తువులే ఇంట్లో ప్రతికూల శక్తులను తీసుకువస్తాయి. నెగటివ్ ఎనర్జీ ప్రవేశిస్తుంది. అంతేకాకుండా బెడ్ రూమ్ లో ఇష్టమున్నట్టుగా వస్తువులను ఎక్కడపడితే అక్కడ పెట్టకూడదు. శుభ్రంగా ఉంచుకోవాలి. బెడ్ రూమ్లో కత్తులు, గన్ లాంటి పరికరాలను ఉంచకూడదు. ఇలా పెట్టుకోవడం వల్ల ఇంట్లో అశుభం కలుగుతుంది. ఇది ఇంట్లో ఉండే వారి వ్యక్తులపై మానసిక ఒత్తిడిని తీసుకువస్తాయి. పడక గదిలో పొరపాటున కూడా కత్తులు, గన్ లు పెట్టుకోకూడదు. బెడ్ రూమ్ లో కొంతమంది దేవుడి చిత్రపటాలను పెట్టుకుంటారు ఇలా పెట్టుకోవడం అస్సలు మంచిది కాదు. బెడ్ రూమ్ ను కేవలం విశ్రాంతి గదిగానే పరిగణించాలి. ఇందులో విశ్రాంతి మాత్రమే తీసుకోవాలి పూజకు సంబంధించిన పరికరాలను దేవుడి చిత్రపటాలను బెడ్ రూమ్ లో పెట్టడం వల్ల అవి నిద్రకు హాని కలిగిస్తాయి. అంతేకాకుండా ఆందోళన, ఒత్తిడి లాంటి సమస్యలు అధికమవుతాయి. ఇంట్లో ఈశాన్యం మూలలో మాత్రమే పూజ గదిని ఉంచుకోవాలి. ఇక ఇంట్లో కొన్ని రకాల దేవుడు చిత్రపటాలను మనసుకు హాయిగా కలిగించే వాటిని ఉంచుకోవాలి. Bed Room

Also Read: Rahul Ramakrishna: సారే రావాలంటున్నాడే.. కేసీఆర్ ఏ కావాలంటున్నారే.. రాహుల్ రామకృష్ణ సంచలన పోస్ట్…

Share your love