NEET పేపర్ లీక్: ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామాకు కేంద్రం గ్రీన్ సిగ్నల్?

NEET Paper Leak కేసులో సోనమ్ వాంగ్చుక్ ఆమరణ దీక్ష ఇంకా కొనసాగుతోంది. ఆయన పరిస్థితి గంభీరంగా ఉండటంతో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఈ విషయంలో కేంద్ర ప్రభుత్వం సీరియస్ అయి, విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామాకు సానుకూలంగా స్పందించినట్లు తెలుస్తోంది. అయితే వాంగ్చుక్ మాత్రం తన డిమాండ్స్ పూర్తి కాకుండా దీక్ష ఆపబోనని స్పష్టం చేశారు.

NEET Paper Leak and New Demands

సోనమ్ వాంగ్చుక్ ప్రధాన డిమాండ్ ఏంటంటే, నిరసనల్లో పాల్గొన్న విద్యార్థులపై భవిష్యత్తులో ఎలాంటి లీగల్ కేసులు పెట్టబోమని ప్రభుత్వం రాతపూర్వక గ్యారెంటీ ఇవ్వాలి. పోలీసులు జూలై 20న జరిగిన ‘చలో సంసద్’ మార్చ్ సమయంలో అతిగా వ్యవహరించారని ఆయన విమర్శించారు. విద్యార్థులు చాలా శాంతియుతంగా నిరసన తెలిపినా, వారిపై కేసులు పెట్టడం సరికాదన్నది ఆయన వాదన.

మంత్రులు జేపీ నడ్డా, జితేంద్ర సింగ్ స్వయంగా ఆసుపత్రికి వెళ్లి వాంగ్చుక్ను కలిసి దీక్ష విరమించాలని కోరారు. ఆ సమయంలో మంత్రి రాజీనామాతో పాటు, ఆత్మహత్య చేసుకున్న విద్యార్థుల కుటుంబాలకు నష్టపరిహారం ఇస్తామని ప్రభుత్వం హామీ ఇచ్చినట్లు వాంగ్చుక్ ఒక లేఖ ద్వారా వెల్లడించారు. కానీ, ఈ హామీలు చాలవని, తన పోరాటం ఇంకా ముగియలేదని ఆయన కరాఖండీగా చెప్పారు.

ఇప్పటికే 65 మంది ఎంపీలు తనను కలిసి దీక్ష ఆపాలని కోరినట్లు వాంగ్చుక్ చెప్పారు. తనకు కూడా ఆరోగ్యంగా బతకాలని, విద్యార్థుల దగ్గరకు వెళ్లి పాఠాలు చెప్పాలని ఉందని ఆయన ఎమోషనల్ అయ్యారు. కానీ విద్యార్థుల భవిష్యత్తు కోసం ప్రారంభించిన ఈ ఉద్యమాన్ని వారిని లీగల్ కేసుల్లో ఇరికించి వదిలేయడం తన వల్ల కాదని స్పష్టం చేశారు. ప్రభుత్వం నుంచి రాతపూర్వక హామీ వచ్చే వరకు తన దీక్ష ఆగదని ఆయన తేల్చి చెప్పారు.

Share your love