
BJP: భారతదేశంలో వరుసగా మూడుసార్లు విజయం సాధించిన భారతీయ జనతా పార్టీ అధ్యక్ష మార్పునకు శ్రీకారం చుట్టినట్లు వార్తలు వస్తున్నాయి. కొన్ని సంవత్సరాలుగా బిజెపి అధ్యక్షులుగా జేపీ నడ్డా కొనసాగుతున్నారు. 2024 పార్లమెంట్ ఎన్నికల సమయంలోనే ఆయనను మార్చేస్తానని వార్తలు వచ్చాయి. కానీ జేపీ నడ్డా నమ్మకం ఉంచిన బిజెపి అధిష్టానం అతన్ని కొనసాగించింది. BJP
Union Minister Dharmendra Pradhan becomes new BJP president
అయితే ఇప్పుడు బిజెపి అధ్యక్ష పదవి మార్పు కచ్చితంగా ఉంటుందని చెబుతున్నారు. కేంద్ర మంత్రి అయిన ధర్మేంద్ర ప్రధాన్ కు భారతీయ జనతా పార్టీ అధ్యక్ష పదవి రాబోతుందట. ఒడిస్సా కు చెందిన ధర్మేంద్ర ప్రధాన్ మూలాలు మొత్తం ఆర్ఎస్ఎస్ కు చందినవే అంటున్నారు. వాజ్పేయి గతంలో ప్రధాన మంత్రిగా ఉన్నప్పుడు ఆయన తండ్రి దేబేంద్ర ప్రధాన్ కూడా కేంద్ర మంత్రిగా పనిచేశారు. BJP
Also Read: Lionel Messi: మెస్సీకి ఘోర అవమానం.. కోల్‌కాతాలో మ్యాచ్ రద్దు ?
ఇప్పుడు ధర్మేంద్ర ప్రధాన్ కూడా కేంద్ర మంత్రిగా ఉన్నారు. కేంద్ర విద్యా శాఖ అలాగే నైపుణ్య అభివృద్ధి, వ్యవస్థాపకత శాఖలకు మంత్రిగా ధర్మేంద్ర ప్రధాన్ కొనసాగుతున్నారు. ఈ నేపథ్యంలోనే జేపీ నడ్డా స్థానంలో ధర్మేంద్ర ప్రధానుకు బిజెపి అధ్యక్ష బాధ్యతలు ఇచ్చేందుకు సిద్ధమైందట అధిష్టానం. ఆర్ఎస్ఎస్ కూడా దీనికి అంగీకారం తెలిపినట్లు చెబుతున్నారు. BJP
Also Read: Kolikapudi Srinivasa Rao: ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాస రావు లీలలు…ఫోటో వైరల్ ?





