ఢిల్లీలో నీట్ పేపర్ లీక్ వ్యవహారంలో నిరసనలు హోరెత్తుతున్నాయి. ఈ క్రమంలో కాక్రోచ్ జనతా పార్టీ ప్రతినిధులు కేంద్ర మంత్రులతో ముచ్చటించారు. నీట్ పేపర్ లీక్ కేసులో ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా డిమాండ్ పై చర్చించారు. దాదాపు గంటన్నర పాటు సమావేశం జరిగింది. విద్యార్థుల ఆత్మహత్యలకు పరిహారం కూడా డిమాండ్ చేశారు.
NEET Paper Leak: Key Demands
సీజేపీ నేత సౌరభ్ దాస్ మీడియాతో మాట్లాడుతూ మూడు ప్రధాన డిమాండ్లు పెట్టినట్లు తెలిపారు. పేపర్ లీక్ కారణంగా ఆత్మహత్య చేసుకున్న విద్యార్థుల కుటుంబాలకు రూ. కోటి పరిహారం అందాలని స్పష్టం చేశారు. పార్లమెంట్ ర్యాలీలో పాల్గొన్న విద్యార్థులపై నమోదైన ఎఫ్ఐఆర్లను ఉపసంహరించాలని కూడా డిమాండ్ చేశారు.
ఈ చర్చల్లో కేంద్ర మంత్రి జేపీ నడ్డా స్పందిస్తూ ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామాపై రేపు మరోసారి చర్చిస్తామని అన్నారు. విద్యార్థుల కేసుల ఎత్తివేతకు కేంద్రం సానుకూలంగా ఉంది. రెండు డిమాండ్లపై ప్రభుత్వం సానుకూలంగా స్పందించినట్లు సౌరభ్ దాస్ తెలిపారు. ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామాకు మాత్రం రేపటి వరకు గడువు కోరింది.
ఇక, ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా వివాదంలో కేంద్రం ఒక మెట్టు దిగినట్లు కనిపిస్తోంది. సీజేపీ డిమాండ్లను లిఖితపూర్వకంగా స్వీకరించిన ప్రభుత్వం శనివారం మధ్యాహ్నం మరోసారి భేటీ కానుంది. ఈ నిర్ణయంపై ఉత్కంఠ కొనసాగుతోంది. పేపర్ లీక్ కేసుకు బాధ్యుడిగా ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామాకు కేంద్రం అంగీకరిస్తే వివాదం ముగియనుంది.





