రామాయణ ట్రైలర్ చూస్తే కళ్లు చెదిరిపోయాయి. భారతీయ సినిమా చరిత్రలోనే ఇదొక సరికొత్త మైలురాయి అనడంలో ఎలాంటి సందేహం లేదు. నితీశ్ తివారీ డైరెక్ట్ చేస్తున్న ఈ పౌరాణిక మూవీ కోసం ప్రపంచం మొత్తం ఎదురుచూస్తోంది. ఇందులో విజువల్స్ అయితే హాలీవుడ్ సినిమాలకు ఏమాత్రం తీసిపోని రేంజ్‌లో ఉన్నాయి. రణ్‌బీర్ కపూర్ రాముడిలా, సాయి పల్లవి సీతలా స్క్రీన్ మీద సజీవంగా కనిపించారు. పవర్‌ఫుల్ విలన్‌గా యశ్ రావణాసురుడి పాత్రలో వైల్డ్ లుక్‌తో అదరగొట్టాడు.
Ramayana Trailer Visual Wonder
మొత్తం నాలుగు వేల కోట్ల బడ్జెట్‌తో తెరకెక్కుతున్న ఈ మెగా ప్రాజెక్ట్ పాన్ ఇండియా లెవల్‌లో కొత్త రికార్డు సృష్టించడం ఖాయం. ఈ సినిమా ఫస్ట్ పార్ట్ ఈ ఏడాది దీపావళి వేళ థియేటర్లలో రిలీజ్ కానుంది. ట్రైలర్‌లోని బ్యాక్‌గ్రౌండ్ స్కోర్, గ్రాఫిక్స్ ఊహించిన దానికంటే ఎన్నో రెట్లు ఎక్కువగా ఉన్నాయని ఫ్యాన్స్ ఫీల్ అవుతున్నారు. చిన్న పాత్రలు కూడా గ్రాండ్‌గా కనిపించడం ఈ మూవీ స్పెషల్ అట్రాక్షన్.
క్యాస్టింగ్ విషయంలో మేకర్స్ ప్రత్యేక శ్రద్ధ పెట్టారు. శ్రీరాముడి సోదరులుగా రవి దూబే లక్ష్మణుడిగా, ఆదినాథ్ కొఠారే భరతుడిగా, నితీశ్ శర్మ శతృఘ్నుడిగా నటిస్తున్నారు. ఇక రామానంద్ సాగర్ రామాయణంలో రాముడిగా అందరి హార్ట్స్ గెలిచిన సీనియర్ యాక్టర్ అరుణ్ గోవిల్, ఈ సినిమాలో దశరథ మహారాజుగా కనిపించబోతున్నారు. ఇది వాళ్ల ఫ్యాన్స్‌కు పండగ అని చెప్పొచ్చు. అలాగే కౌసల్యగా ఇందిరా కృష్ణన్, కైకేయిగా లారా దత్త, సుమిత్రగా సోనల్ ఝా ఈ స్టోరీకి మరింత లైఫ్ ఇచ్చారు.
ఇతర కీలకమైన పాత్రల విషయానికొస్తే, వశిష్ట మహర్షిగా శిశిర్ శర్మ, విశ్వామిత్రుడిగా అజింక్య దేవ్ యాక్టింగ్ నెక్ట్స్ లెవెల్‌కు తీసుకెళ్లారు. స్టోరీలో కీ ట్విస్ట్ ఇచ్చే మంథరగా సీబా చద్దా సీరియస్ పెర్ఫార్మెన్స్ ఇచ్చినట్టు ట్రైలర్ చూస్తేనే అర్థమవుతోంది. ఈ పురాణాన్ని నేటి జనరేషన్‌కి కనెక్ట్ అయ్యేలా, లేటెస్ట్ టెక్నాలజీతో డైరెక్టర్ స్క్రీన్ మీదకు తీసుకొచ్చారు. ఈ దీపావళి బాక్సాఫీస్ దగ్గర కొత్త హిస్టరీ రాయడానికి రామాయణం పూర్తిగా రెడీ అయిపోయింది.
https://x.com/pakkafilmy007/status/1600352362639822848





