Raka: రెండు భాగాలుగా వస్తోన్న అల్లు అర్జున్ ‘రాకా’ మూవీ?

బన్నీ-అట్లీ కాంబోలో వస్తోన్న పాన్-వరల్డ్ మూవీ ‘రాకా’పై ఓ క్రేజీ అప్డేట్ బయటకు వచ్చింది. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, అట్లీ టీమ్ అప్లో తెరకెక్కుతున్న ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. ఇప్పటికే ఈ ప్రాజెక్ట్ అనౌన్స్మెంట్తో భారీ అంచనాలు క్రియేట్ అయ్యాయి. తాజాగా ఫిలింనగర్ సర్కిల్స్లో వైరల్ అవుతున్న న్యూస్ ప్రకారం, ఈ రాకా సినిమా సింగిల్ పార్ట్ కాకుండా రెండు భాగాలుగా రిలీజ్ కానుందట. ఈ రెండు పార్ట్లను కలిపి ఏకంగా రూ.1000 కోట్ల బడ్జెట్తో తీస్తున్నట్లు తెలుస్తోంది. ఈ మేకర్స్ ప్లాన్ ప్రకారం, రెండు భారీ భాగాలను ప్రేక్షకుల ముందుకు తీసుకురావడానికి సిద్ధమవుతున్నారు.

Raka Movie Two Parts Update

ఈ రెండు భాగాలలో రెండు స్టార్ హీరోయిన్లు ఉండనున్నారు. ఒక పార్ట్లో అల్లు అర్జున్ సరసన బాలీవుడ్ బ్యూటీ దీపికా పదుకొను నటించనుంది. మరో భాగంలో టాలెంటెడ్ నటి మృణాల్ ఠాకూర్ ప్రధాన పాత్ర పోషించనుంది. ఇద్దరూ వేర్వేరు టైమ్లైన్లలో బన్నీకి జోడిగా కనిపించనున్నారు. ఈ సినిమాలో బాలీవుడ్ బాద్షా షారుఖ్ ఖాన్ ఒక స్పెషల్ అతిథి పాత్రలో నటించనున్నారని కూడా ప్రచారం జోరుగా ఉంది. అట్లీ డైరెక్షన్లో ఇప్పటికే షారుఖ్ నటించిన ‘జవాన్’ బాక్సాఫీస్ వద్ద సంచలన విజయం సాధించింది, దీంతో ఈ రాకా సినిమాలో ఆయన ఉంటే గ్రాండ్ లెవల్ పెరుగుతుందని అభిమానులు భావిస్తున్నారు.

కథాంశం విషయానికొస్తే, అట్లీ చాలా వైవిధ్యంగా ప్లాన్ చేశారు. ఒక పార్ట్ పూర్తిగా హిస్టారికల్ బ్యాక్డ్రాప్ మరియు ఫాంటసీ ఎలిమెంట్స్తో ఉండనుంది. మరో పార్ట్ పూర్తిగా భిన్నమైన ఫ్యూచరిస్టిక్ ప్రపంచంలో నడిచేలా రూపొందించారట. ఈ లెక్కన, హిస్టారికల్ నేపథ్యంలో వచ్చే భాగంలో దీపికా పదుకొన్ నటిస్తే, ఫ్యూచరిస్టిక్ భాగంలో మృణాల్ ఠాకూర్ కనిపించనుంది. ఈ రెండు భాగాలు ఒకదానికొకటి కనెక్ట్ అవుతాయా లేదంటే వేర్వేరు స్టోరీలనే అనేది ఇంకా క్లారిటీ రాలేదు. కానీ అట్లీ తన మార్క్ ట్విస్ట్తో ప్రేక్షకులను సర్ప్రైజ్ చేయడం ఖాయం.

ఇప్పటికే ఈ సినిమా షూటింగ్ శరవేగంగా సాగుతోంది. మేకర్స్ ఈ రెండు భాగాలను ఏకకాలంలో తెరకెక్కించనున్నారు. ఈ రాకా సినిమాపై అంచనాలు స్కై హై లెవల్లో ఉన్నాయి. బన్నీ-అట్లీ కాంబినేషన్ మరియు భారీ బడ్జెట్తో ఈ సినిమా పాన్-వరల్డ్ లెవల్లో మార్కెట్ చేయబడుతుంది. ఖచ్చితంగా ఇది ఒక భారీ హిట్ అవుతుంది అనే నమ్మకం అందరిలో ఉంది. ఇక షారుఖ్ ఖాన్ స్పెషల్ అప్పియరెన్స్ కూడా కన్ఫర్మ్ అయితే, ఇది మరింత గ్రాండ్ గా మారుతుంది.

https://x.com/pakkafilmy007/status/1600352362639822848

Share your love