Sunil Anand: బాలీవుడ్ నిర్మాత సునీల్ ఆనంద్ గుండెపోటుతో హఠాన్మరణం

Sunil Anand Bollywood producer death

బాలీవుడ్ నిర్మాత సునీల్ ఆనంద్ గుండెపోటుతో హఠాన్మరణం చెందారు. దేవ్ ఆనంద్ పెద్ద కుమారుడైన ఈయన లండన్‌లో చివరి శ్వాస విడిచారు. 70 ఏళ్ల వయసులో ఫ్లైట్‌లో వస్తుండగా హార్ట్ ఎటాక్ వచ్చింది. ఆసుపత్రిలో స్టంట్ వేయడానికి ప్రయత్నించినా రెండోసారి గుండెపోటు రావడంతో ప్రాణాలు కాపాడలేకపోయారు డాక్టర్లు.

Sunil Anand Heart Attack Tragedy

ఈ సంఘటనలో ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే, 2011లో తండ్రి దేవ్ ఆనంద్ మరణించిన అదే హాస్పిటల్‌లో సునీల్ కూడా తుది శ్వాస విడిచారు. ఈ జూలై 26న ఈ సంఘటన జరిగింది. జూన్ 30న ఆయన 70వ బర్త్‌డే సెలబ్రేట్ చేసుకున్నారు. కుటుంబం తరపున మేనకోడలు గిన నారంగ్ ఈ విషాద వార్తను కన్ఫర్మ్ చేశారు.

సునీల్ 1984లో తండ్రి దర్శకత్వంలో వచ్చిన ‘ఆనంద్ ఔర్ ఆనంద్’ సినిమాతో ఇండస్ట్రీలో అడుగుపెట్టారు. ఆ తర్వాత ‘కార్ థీఫ్’, ‘మైన్ తెరే లియె’, ‘మాస్టర్’ లాంటి సినిమాల్లో నటించారు. దేవ్ ఆనంద్ మరియు నటి కల్పనా కార్తీక్ కుమారుడైన ఈయన నటుడు మరియు ప్రొడ్యూసర్‌గా పేరు తెచ్చుకున్నారు.

కుటుంబం ప్రస్తుతం షాక్‌లో ఉంది. గిన నారంగ్ ట్విట్టర్‌లో ఈ విషయాన్ని షేర్ చేశారు. మా హార్ట్స్ అన్నీ భారంగా ఉన్నాయి. మీ ప్రేమ, సపోర్ట్‌కు థాంక్స్. ఈ కష్ట సమయంలో మా ప్రైవసీని రెస్పెక్ట్ చేయండి అని ఆమె కోరారు. ఇండస్ట్రీలో సునీల్ మరణం పెద్ద షాక్‌గా మారింది.
https://x.com/pakkafilmy007/status/1600352362639822848

Visited 1 times, 1 visit(s) today

Leave a Comment