హీనా ఖాన్: క్యాన్సర్ రోగులకు ఐస్ థెరపీ సురక్షితమేనా?

హీనా ఖాన్ క్యాన్సర్ జర్నీలో ఇప్పుడు కొత్త ట్రెండ్ నెట్టింట్లో హాట్ టాపిక్ అయ్యింది. స్టేజ్ 3 బ్రెస్ట్ క్యాన్సర్ నుంచి కోలుకుంటున్న ఈ నటి, ఇటీవల ఐస్ బాత్ థెరపీ చేస్తూ తన రికార్డును తానే బ్రేక్ చేసుకుంది. ముందు 7 నిమిషాలు చేసిన ఈ ఛాలెంజ్‌ని ఇప్పుడు ఏకంగా 12 నిమిషాలకు పొడిగించింది. “70 కిలోల మంచు వేసి, 12 నిమిషాలు ఉన్నాను” అంటూ ఓ Insta వీడియోలో షేర్ చేసింది. అయితే, డాక్టర్ల కఠిన పర్యవేక్షణలోనే ఇది చేస్తున్నానని, ఎవరూ ప్రొఫెషనల్ గైడెన్స్ లేకుండా ట్రై చేయొద్దని స్పష్టంగా వార్నింగ్ ఇచ్చింది. మరి ఈ ఐస్ థెరపీ క్యాన్సర్ పేషెంట్లకు సురక్షితమేనా అనే సందేహం సహజంగానే వస్తుంది.

Ice Therapy Safe For Cancer Survivors

ముంబైలోని స్పెషాలిటీ సర్జికల్ ఆంకాలజీ హాస్పిటల్ కు చెందిన హెడ్ అండ్ నెక్ సర్జన్ డాక్టర్ అమిత్ చక్రవర్తి మాట్లాడుతూ, ఐస్ థెరపీ లేదా క్రయోథెరపీ అనేది బ్రెస్ట్ క్యాన్సర్ రికవరీలో ఉన్న కొంతమందికి ఉపయోగపడుతుందన్నారు. సర్జరీ తర్వాత లేదా ఫిజికల్ రీహాబిలిటేషన్ సమయంలో నొప్పి, వాపు, ఇన్ఫ్లమేషన్ తగ్గించడంలో ఇది హెల్ప్ చేస్తుందని డాక్టర్ వివరించారు. కానీ ఇది పూర్తిగా ట్రీటింగ్ డాక్టర్ సలహా తర్వాత మాత్రమే వాడాలి. స్కిన్ సెన్సేషన్ తగ్గినవారు, బ్లడ్ సర్క్యులేషన్ సరిగా లేనివారు లేదా లింఫెడెమా సమస్య ఉన్న రోగులు మంచును యూజ్ చేయడం రిస్క్ తో కూడుకున్నది. ఇది చర్మానికి గాయం చేయొచ్చు లేదా పరిస్థితిని మరింత దిగజార్చొచ్చని ఆయన హెచ్చరించారు.

ముంబై సెంట్రల్ లోని వోకార్డ్ట్ హాస్పిటల్స్ కన్సల్టెంట్ ఆంకో సర్జన్ డాక్టర్ మేఘల్ సంఘవి ఈ విషయంలో మరింత స్పష్టత ఇచ్చారు. క్యాన్సర్ రికవరీ ప్రతి ఒక్కరికీ డిఫరెంట్ గా ఉంటుంది కాబట్టి, అథ్లెట్లు లేదా ఫిట్‌నెస్ లవర్స్ ఫాలో అయ్యే రెమెడీస్ ఆటోమేటిక్‌గా బ్రెస్ట్ క్యాన్సర్ సర్వైవర్లకు సూట్ కాదని తెలిపారు. హోల్-బాడీ క్రయోథెరపీ వల్ల వ్యాయామం తర్వాత అనుభవించే అసౌకర్యం తగ్గినా, బ్రెస్ట్ క్యాన్సర్ రోగుల పునరావాసం కోసం దీని ప్రయోజనాలు ఇంకా రీసెర్చ్ దశలోనే ఉన్నాయి. సున్నితమైన వ్యాయామాలు, సరైన గాయం సంరక్షణ, బ్యాలెన్స్డ్ డైట్, రెగ్యులర్ ఫాలో-అప్ లు వంటివి చాలా ముఖ్యమని డాక్టర్ నొక్కి చెప్పారు.

ఈ మొత్తం చర్చలో డాక్టర్లు చెప్పే ఒకే ఒక కీలక సూచన ఏంటంటే, ఎవరూ ట్రెండ్స్ చూసి సొంతంగా ఇలాంటి థెరపీలు ట్రై చేయకూడదు. “ఫలానా వ్యక్తి చేస్తున్నారని మీరూ ఫాలో అవ్వడం రిస్క్. ముందు డాక్టర్‌ని కన్సల్ట్ చేసి, తర్వాతే ఏ అడుగు వేయాలి” అని డాక్టర్ చక్రవర్తి గట్టిగా సలహా ఇచ్చారు. హీనా ఖాన్ విషయంలోనూ, ఆమె నెమ్మదిగా వెళ్తానని, తన బాడీని వింటానని చెప్పడం ఒక మంచి ఉదాహరణ. ఆరోగ్యం విషయంలో మెల్లగా, జాగ్రత్తగా ఉండటమే బెటర్ అని ఈ నిపుణుల అభిప్రాయాలు స్పష్టం చేస్తున్నాయి.

https://x.com/pakkafilmy007/status/1600352362639822848

Share your love