
నగర ప్రయాణికులకు ఆర్టీసి బస్సులు గుడ్న్యూస్ చెప్పాయి. రాత్రి వేళల్లో రాకపోకలు సాగించే ప్రయాణికుల సౌలభ్యం కోసం ప్రత్యేక సర్వీసులను అందుబాటులోకి తీసుకురావాలని నిర్ణయించారు. దీని ద్వారా లేట్ నైట్ జర్నీ చేసే ఉద్యోగులు, విద్యార్థులు అలాగే ఇతర పనులపై బయటికి వెళ్లే వారికి రవాణా కష్టాలు పూర్తిగా తొలగిపోనున్నాయి.
night services for rtc bus
హైదరాబాద్ నగరంలో రాత్రి సమయాల్లో రవాణా సౌకర్యం లేక ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్న సంగతి తెలిసిందే. ముఖ్యంగా ఐటీ ఉద్యోగులు, రాత్రి షిఫ్ట్ చేసే వర్కర్లు సొంత వాహనాలు లేక ఆటోలు, క్యాబ్లపై ఆధారపడాల్సి వస్తోంది. ఈ సమస్యకు చెక్ పెట్టేందుకు రాత్రి వేళల్లో కూడా ప్రధాన రూట్లలో బస్సులను నడిపేలా అధికారులు ప్రణాళిక సిద్ధం చేశారు.
ప్రధాన జంక్షన్లు, రద్దీ ఉండే ప్రాంతాలను కలుపుతూ ఈ నైట్ సర్వీసులు తిరగనున్నాయి. ఏయే రూట్లలో ఈ బస్సులు నడుస్తాయనే పూర్తి వివరాలను త్వరలోనే అధికారికంగా ప్రకటించనున్నారు. ప్రయాణికుల భద్రతకు పెద్దపీట వేస్తూ ఈ సర్వీసులను నడపాలని యోచిస్తున్నారు.
ఈ నిర్ణయం వల్ల రాత్రి సమయాల్లో తిరిగే సామాన్యులకు ఆర్థిక భారం కూడా తగ్గనుంది. ఆర్టీసీ తీసుకున్న ఈ సరికొత్త నిర్ణయం పట్ల నగర ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. బస్సుల సంఖ్య పెరగడంతో రాత్రి వేళ ప్రయాణం మరింత సులభం కానుంది.





