
Telangana RTC: ప్రయాణికులకు బిగ్ షాక్. ఇకపై హైదరాబాద్ ఔటర్ రింగ్ రోడ్డు లోపలే సిటీ బస్సులు నడువనున్నాయని వార్తలు వస్తున్నాయి. దూర ప్రాంతాలకు వెళ్లే బస్సులను, సదరు సిబ్బందిని జిల్లా డిపోలకు బదిలీ చేశారని సమాచారం. నగరంలో సిబ్బందికి ఇచ్చే అధిక హెచ్ఆర్ఏ, సీసీఏ భారం తగ్గించుకునేందుకు ఆర్టీసీ ప్రణాళిక చేసినట్లు తెలుస్తోంది. Telangana RTC
Telangana RTC City buses will now operate within the Hyderabad Outer Ring Road
హైదరాబాద్ నగరం నుండి 30–50 కిలోమీటర్ల దూర ప్రాంతాలకు తిరుగుతున్న సిటీ బస్సులను, జిల్లా డిపోలకు తరలించే ప్రణాళిక సిద్ధం చేస్తోందట ఆర్టీసీ. భవిష్యత్తులో హైదరాబాద్ నగరమంతా ప్రైవేట్ సంస్థల ;lkఆధ్వర్యంలో ఎలక్ట్రిక్ బస్సులు తిరగనున్న నేపధ్యంలో, డీజిల్ బస్సుల్లో పని చేస్తున్న సిబందిని(కండక్టర్లు తప్ప) జిల్లా డిపోలకు తరలించాల్సి వస్తుందని సమాచారం. ఈ ప్రక్రియను ఇప్పటినుండే మొదలు పెట్టేందుకు ఆర్టీసీ ప్రణాళికలు చేస్తోందని సమాచారం.Telangana RTC
Also Read: VIJAY THALAPATHY : రజినీకాంత్ ను బెదిరించిన డీఎంకే.. టీవీకే నేత కామెంట్స్ వివాదస్పదం..!
గ్రేటర్ నగర డిపోల్లో పనిచేసే ఆర్టీసీ సిబ్బందికి, జిల్లా డిపోల్లో పనిచేసే సిబ్బంది కంటే ఎక్కువ అద్దె భత్యం (హెచ్ఆర్ఏ), ప్రత్యేక నగర పరిహార భత్యం( సీసీఏ) ఉండడంతో, ఆ భారాన్ని తగ్గించుకునే ఆలోచనలో ఆర్టీసీ సంస్థ ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. మరోవైపు ఎలక్ట్రిక్ బస్సులను ప్రైవేట్ సంస్థలకు కట్టబెట్టే ఆలోచనపై నిరసనలు వ్యక్తం చేస్తున్నాయి ఆర్టీసీ కార్మికుల సంఘాలు. Telangana RTC





