
ప్రాజెక్టు పరిధిలో ఇప్పటివరకు ఎలాంటి లేఅవుట్లు, టౌన్‌షిప్‌లు లేదా భవన నిర్మాణ ప్రాజెక్టులకు అనుమతులు ఇవ్వలేదని ఫ్యూచర్ సిటీ డెవలప్మెంట్ అథారిటీ (ఎఫ్‌సీడీఏ) నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ (ఎన్జీటీ)కి వివరించింది. పర్యావరణ అనుమతులు అవసరమయ్యే ఏ ప్రతిపాదన కూడా తమ వద్దకు రాలేదని స్పష్టం చేసింది. ఈ మేరకు చెన్నై బెంచ్ ముందు కౌంటర్ అఫిడవిట్ దాఖలు చేస్తూ, ప్రాజెక్టుపై దాఖలైన పిటిషన్‌ను కొట్టివేయాలని కోరింది.
Hyderabad No Future Project City
పర్యావరణ అనుమతులు లేకుండానే ప్రభుత్వం ఈ ప్రాజెక్టును చేపట్టిందని ఆరోపిస్తూ దాఖలైన పిటిషన్‌పై ఎన్జీటీ గతంలో నోటీసులు జారీ చేసింది. అయితే ఈ ఆరోపణలు నిరాధారమని, ప్రాజెక్టు ఇంకా ప్రాథమిక దశలోనే ఉందని అధికారులు పేర్కొన్నారు. ప్రస్తుతం ఎటువంటి అభివృద్ధి పనులు ప్రారంభం కాలేదని, కేవలం మాస్టర్ ప్లాన్ తయారీ కోసం కన్సల్టెంట్‌ను నియమించే ప్రక్రియ మాత్రమే జరుగుతోందని స్పష్టం చేశారు.
పిటిషనర్ ఆధారంగా చూపిన వెబ్‌సైట్‌తో తమకు ఎటువంటి సంబంధం లేదని అథారిటీ తేల్చి చెప్పింది. ఆ వెబ్‌సైట్‌ను తాము నిర్వహించడం లేదని, దాని వెనుక ఉన్నవారిపై క్రిమినల్ చర్యలు తీసుకునేందుకు సిద్ధమవుతున్నట్లు తెలిపింది. మీర్ఖాన్పేటలో నిర్మిస్తున్న కార్యాలయం కేవలం పరిపాలనా అవసరాల కోసమేనని, అది ఏ టౌన్షిప్ ప్రాజెక్టులో భాగం కాదని వివరణ ఇచ్చింది.
ఇవి కూడా చదవండి:
- DSC-2002: విద్యాశాఖ తీరుపై హైకోర్టు ఆగ్రహం.. కారణం ఏంటంటే?
- AP Elections: ఏపీలో నేడే జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల పోలింగ్.. ఉదయం 7 గంటల నుంచే ప్రారంభం?
- Odisha Doubles: కోటియా సరిహద్దులో ఉద్రిక్తత.. ఏపీ వెనక్కి తగ్గుతుందా?
2025 మార్చిలో జారీ చేసిన జీవో నంబర్ 69 ప్రకారం ఎఫ్‌సీడీఏ ఏర్పడిందని, దీని పరిధిలో 56 రెవెన్యూ గ్రామాలు ఉన్నాయని అధికారులు తెలిపారు. ఇది కేవలం ప్రణాళికాబద్ధమైన అభివృద్ధిని పర్యవేక్షించే అథారిటీ మాత్రమేనని, రియల్ ఎస్టేట్ ప్రాజెక్టు కాదని స్పష్టం చేశారు. పారిశ్రామిక కార్యకలాపాలు లేదా ఇతర ప్రాజెక్టులకు సంబంధించిన అనుమతులు వేరే విభాగాల పరిధిలోకి వస్తాయని పేర్కొన్నారు.
ప్రశాంత్ – పక్కా ఫిల్మీ తెలుగు ఎడిటర్. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు, తెలుగు సినిమా, క్రీడలు, ప్రభుత్వ పథకాలు మరియు ప్రజలకు ఉపయోగపడే వార్తలను సులభమైన తెలుగులో అందిస్తారు. ప్రతి వార్త మా ఎడిటోరియల్ పాలసీ ప్రకారం సమాచారం సరిచూసిన తర్వాతే ప్రచురించబడుతుంది. ఫాలో అవ్వండి — X: https://x.com/pakkafilmy007 | Telegram: https://t.me/pakkafilmytelugu | Instagram: https://instagram.com/pakkafilmy_





