Allu Aravind : హీరోయిన్‌లా ఉన్నావు.. సినిమాలో నటిస్తావా? యాంకర్ Charmila కు ఆఫర్

ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్ ఇటీవల ఓ సినిమా ఈవెంట్‌లో యాంకర్ చర్మిళ్లతో చేసిన సరదా సంభాషణ ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారింది. కిరణ్ అబ్బవరం హీరోగా నటిస్తున్న ‘చెన్నై లవ్ స్టోరీ’ సినిమా ట్రైలర్ లాంచ్ ఈవెంట్‌కి అల్లు అరవింద్ చీఫ్ గెస్ట్‌గా వచ్చారు. ఈ కార్యక్రమాన్ని యాంకర్ చర్మిళ్ల చాలా అందంగా హోస్ట్ చేసింది. ఈ సందర్భంగా అల్లు అరవింద్ ఆమెతో మాట్లాడిన తీరు, అడిగిన ప్రశ్న అందర్నీ ఆకట్టుకుంటోంది.

Allu Aravind Charmila Offer

ఈవెంట్‌లో చర్మిళ్ల స్టేజ్ మీదకు వచ్చి అల్లు అరవింద్‌ని కాస్త సరదాగా “ఈ సినిమా తొలిప్రేమ కథ కాదు కదా, మీ అభిప్రాయం ఏంటి?” అని అడిగింది. అప్పుడు ఆయన నవ్వుతూ “టైటిల్ ‘చెన్నై లవ్ స్టోరీ’ నాకు బాగా కనెక్ట్ అయ్యింది. ఎందుకంటే లవ్ చేసే ఏజ్‌లో నేను చెన్నైలోనే ఉండి చదువుకున్నాను” అని చెప్పారు. ఆ తర్వాత అల్లు అరవింద్ ఆమెను ఫోన్ చేసి, “ఈ మధ్య యాంకర్లు అంతా హీరోయిన్ల తరహాలో కనిపిస్తున్నారు. నువ్వు నా నెక్స్ట్ సినిమాలో act చేస్తావా?” అని ఆఫర్ ఇచ్చేశారు.

యాంకర్ చర్మిళ్ల ఈ కంప్లిమెంట్ విని వెంటనే షాక్ అయ్యింది, కానీ సంతోషంగా ఫీల్ అయ్యింది. నిజానికి ఆమె కెరీర్ RJ గా స్టార్ట్ అయ్యింది. ఇప్పుడు యాంకరింగ్‌లో ఫుల్ బిజీగా ఉంటూ తనదైన స్టయిల్‌తో అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. ఇలాంటి టాప్ ప్రొడ్యుసర్ నోట నుంచి ఈ మాటలు రావడం ఆమెకు బూస్ట్ అనే చెప్పాలి.

యాంకర్ చర్మిళ్ల తన స్పాంటేనియస్ రియాక్షన్స్ తో, చక్కటి పదాల వాడకంతో ప్రస్తుతం యూత్ లో బాగా పాపులర్. ఆమె మాటల్లో చురుకుదనం క్యామెరా ముందు స్టేజ్ ప్రెజెన్స్ సినిమాలకు కరెక్ట్ గా సరిపోతాయి అని నెటిజన్లు కూడా కామెంట్ చేస్తున్నారు. ఈ ఒక్క మాట ఆమె కెరీర్‌కి కొత్త మలుపు తిప్పొచ్చు.

ఇక ఈ సంఘటనకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ అవడంతో రేపోమాపో యాంకర్ నుంచి సిల్వర్ స్క్రీన్ కి ఛార్మిలా జర్నీ స్టార్ట్ అయినా ఆశ్చర్యపోవాల్సిన పనిలేదు. చూడాలి మరి అల్లు అరవింద్ నిజంగానే తన మాట నిలబెట్టుకుంటాడో లేదో! మొత్తానికి ఈ యాంకర్‌కి ఒక చాన్స్ రావడం ఖాయం అనే టాక్ ఇండస్ట్రీలో వినిపిస్తోంది.

Share your love