Ameer Log: ఆగస్ట్ 21న రానా రిలీజ్ చేస్తున్న హైదరాబాద్ కామెడీ సినిమా

హైదరాబాద్ కామెడీ సినిమా ‘అమీర్ లోగ్’ ఆగస్ట్ 21న రానా దగ్గుబాటి రిలీజ్ చేస్తున్నారు. ఈ సినిమా హైదరాబాద్ బస్తీల నేపథ్యంలో యూత్ ఫుల్ ఎంటర్టైనర్‌గా తెరకెక్కింది. రమణా రెడ్డి సోమ దర్శకత్వంలో, మాధవి రెడ్డి సోమ నిర్మాణంలో వస్తున్న ఈ మూవీలో హరి, మనోజ్, శశిధర్ హీరోలుగా నటిస్తున్నారు. వేద జలంధర్, రావణ్ నిట్టూరు, విశ్వేందర్ రెడ్డి, సాయియోగి కీలక పాత్రలు పోషించారు.

Ameer Log Hyderabad Comedy Film

స్పిరిట్ మీడియా బ్యానర్‌పై రానా దగ్గుబాటి ఈ సినిమాను తెలుగులో రిలీజ్ చేస్తున్నారు. ఇటీవల జరిగిన ప్రెస్ మీట్‌లో ఓ సాంగ్ రిలీజ్ చేసి, సినిమా రిలీజ్ డేట్‌ను అనౌన్స్ చేశారు. ఈ సినిమా ఆగస్ట్ 21న థియేటర్లలో విడుదల అవుతుంది. ఇప్పటికే ఈ మూవీపై మంచి హైప్ ఉంది.

దర్శకుడు రమణా రెడ్డి మాట్లాడుతూ హైదరాబాద్ మనుషుల్ని తెరపై ప్రెజెంట్ చేయాలనే ఆలోచనతో ఈ సినిమా తీశారు. డబ్బులున్న వారు అమీర్ లోగా? లేదా సంతోషంగా ఉన్నవారు అమీర్ లోగా? అనే కాన్సెప్ట్‌తో ఈ సినిమాను క్రియేట్ చేశారు. స్పిరిట్ మీడియా టీంకి సినిమా నచ్చడంతో వారే రిలీజ్ చేస్తున్నారు.

నిర్మాత మాధవి రెడ్డి మాట్లాడుతూ ఈ సినిమాలో చూపించే బస్తీలోనే తను పుట్టి పెరిగారు. అక్కడి నుంచి ఇక్కడికి రావడానికి తన భర్త రమణా రెడ్డి కారణం అని చెప్పారు. మ్యూజిక్ డైరెక్టర్ స్మరణ్ సాయి మాట్లాడుతూ కల్చర్‌ను క్యాప్చర్ చేసే సినిమాలు తనకు చాలా ఇష్టమని, రమణా రెడ్డి హైదరాబాద్‌ను అద్బుతంగా ప్రెజెంట్ చేశారని అన్నారు. నటుడు మనోజ్ మాట్లాడుతూ హైదరాబాద్ మనుషులు, బిర్యానీ, క్రికెట్ ప్యాషన్ గురించి ఎవరైనా అడిగితే వారికి ఈ సినిమా చూపించమని సూచించారు.

Share your love
PakkaFilmy Telugu

PakkaFilmy Telugu