
Rana: దగ్గుబాటి రానా భార్య నిజంగానే ప్రెగ్నెంటా.. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియోలో ఉన్నది ఎంత నిజం అనేది ఇప్పుడు చూద్దాం. తాజాగా దగ్గుబాటి రానా భార్య మిహికా బజాజ్ కి సంబంధించి ఒక వీడియో యూట్యూబ్ లో చక్కర్లు కొడుతోంది. అందులో రానా భార్య మిహికా బేబీ బంప్ క్లియర్ కట్ గా కనిపిస్తోంది.. ఇక ఈ వీడియో ఎక్కడిది అంటే రీసెంట్ గా జూనియర్ ఎన్టీఆర్ బావమరిది పెళ్లికి రానా తన భార్యతో కలిసి వచ్చారు.
Rana wife Mihika Baby bump
అయితే ఈ పెళ్లిలో మిహికా బజాజ్ బ్లూ కలర్ సారీ కట్టుకొని కనిపించింది. అయితే అలా శారీలో నడుచుకుంటూ వస్తున్న సమయంలో మిహికా బేబీ బంప్ చాలా క్లియర్ గా కనిపిస్తోంది. దాంతో చాలామంది ఈ వీడియో చూసిన నెటిజన్లు మిహిక ప్రెగ్నెంట్ అని, రానా దగ్గుబాటి తండ్రి కాబోతున్నాడని కామెంట్లు పెడుతున్నారు. అయితే ఆ బేబీ బంప్ చూస్తూ ఉంటే మిహికా బజాజ్ కి ఐదో నెల వచ్చేసినట్టు అర్థమవుతుంది.(Rana)
Also Read: Siddu Jonnalagadda: సిద్ధూ “ఉమెనైజర్” వివాదం.. స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చిన జొన్నలగడ్డ!!
కానీ ఇప్పటివరకు రానా తన భార్య ప్రెగ్నెన్సీ విషయాన్ని మాత్రం బయట పెట్టలేదు.. మరి రానా తన భార్య ప్రెగ్నెన్సీ విషయాన్ని ఎందుకు దాస్తున్నారు అనేది తెలియాల్సి ఉంది. ఇక రానా మిహిక బజాజ్ లాక్ డౌన్ సమయంలో అంటే 2022లో పెళ్లి చేసుకున్నారు. కానీ ఇప్పటివరకైతే గుడ్ న్యూస్ చెప్పలేదు.

ఇక ఈయన కంటే వెనక పెళ్లి చేసుకున్న తమ్ముడు అభిరామ్ ఓ బిడ్డకు తండ్రి అయ్యాడు. అయితే రానా దగ్గుబాటి మాత్రం ఇప్పటివరకు గుడ్ న్యూస్ చెప్పడం లేదు. కానీ ఇప్పుడు వైరల్ అవుతున్న వీడియో చూస్తుంటే మాత్రం ఖచ్చితంగా రానా తండ్రి కాబోతున్నాడని అర్థమవుతుంది.మరి ఈ గుడ్ న్యూస్ రానా అభిమానులతో ఎప్పుడు పంచుకుంటాడో చూడాలి.(Rana)





