రామాయణం పార్ట్-1 ఎక్కడ ఆగుతుంది అనే విషయంపై క్లారిటీ వచ్చేసింది. దర్శకుడు నితీష్ తివారీ ఈ సినిమా మొదటి భాగం ఓ పెద్ద cliffhangerతో ముగుస్తుందని స్పష్టం చేశారు. సాన్ డియాగో కామిక్-కాన్ 2026లో జరిగిన ఈవెంట్లో ఆయన ఈ డిటైల్స్ షేర్ చేశారు. రామాయణం లాంటి భారీ కథను ఒకే సినిమాలో పట్టించడం కష్టం కాబట్టి రెండు భాగాలుగా తీస్తున్నారు. పార్ట్-1 ఎక్కడ ఆపితే బెటర్ అవుతుందనే దానిపై టీమ్ చాలా థింక్ చేసి ఫైనలైజ్ చేసింది.
ramayanam part 1 cliffhanger twist
రణ్‌బీర్ కపూర్ మాట్లాడుతూ తను ఇప్పటివరకు క్లైమాక్స్ సీన్స్ షూట్ చేయలేదని చెప్పారు. లీక్ అయిన వీడియోలను కంట్రోల్ చేసేందుకు నిర్మాత నమిత్ మల్హోత్రా యాంటీపైరసీ డ్రైవ్ స్టార్ట్ చేశారు. భారత్ మండపం వేదికగా జరిగిన ప్రథమ్ సంకల్ప్ ఈవెంట్, ముంబై స్క్రీనింగ్‌ల నుండి లీక్ అయిన క్లిప్స్ సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతున్నాయి. మేకర్స్ ఈ లీక్స్‌ను సీరియస్‌గా తీసుకుని టీమ్‌ను అలర్ట్ చేశారు.
ఈ పాన్ ఇండియా మైలాగికల్ చిత్రం భారీ తారాగణంతో తెరకెక్కుతోంది. ప్రస్తుతం దేశవ్యాప్తంగా సినీ ప్రియుల్లో ట్రైలర్ కోసం ఎదురుచూపులు మొదలయ్యాయి. మేకర్స్ త్వరలోనే ఆఫీషియల్ ట్రైలర్ రిలీజ్ చేస్తారని అంచనా. రెండు భాగాలుగా రానున్న ఈ దృశ్యకావ్యం భారతీయ సినిమా చరిత్రలో సంచలనం సృష్టిస్తుందని ట్రేడ్ వర్గాలు కాన్ఫిడెంట్‌గా ఉన్నాయి. యశ్, రణ్‌బీర్ కపూర్ లాంటి స్టార్స్ నటిస్తుండటంతో హైప్ మరింత పెరిగింది.





