బాలీవుడ్ స్టార్ హీరో అమీర్ ఖాన్‌కు లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్ నుండి పెద్ద threat వచ్చింది. ఈ ముఠా తరఫున అర్జూ బిష్ణోయ్ మరియు టైసన్ అనే వ్యక్తి మాట్లాడిన audio clip సోషల్ మీడియాలో viral అయ్యింది. అందులో అమీర్ ఖాన్ personal life గురించి, ముఖ్యంగా ఆయన మూడో పెళ్లి గురించి తీవ్ర అభ్యంతరాలు వ్యక్తం చేశారు. ఈ audio వలన బాలీవుడ్ లో పెద్ద సంచలనం మొదలైంది.
Bishnoi gang threats to Aamir Khan audio
అమీర్ ఖాన్ ఇటీవలే గౌరీ స్ప్రాట్ ని పెళ్లి చేసుకున్న విషయం తెలిసిందే. కానీ ఈ గ్యాంగ్ మాత్రం ఈ పెళ్లిని సనాతన ధర్మానికి, భారతీయ సంస్కృతికి వ్యతిరేకంగా చూస్తోంది. ఆడియోలో వాళ్లు అమీర్ తన పెళ్లి ద్వారా సమాజంలో తప్పుడు సంకేతాలు పంపుతున్నాడని, దీని consequences చాలా serious గా ఉంటాయని హెచ్చరించారు. ఇలాంటి threats వలన celebrities ప్రైవసీ పూర్తిగా డామేజ్ అవుతుంది అనే ఆందోళన అందరిలో కనిపిస్తోంది.
లారెన్స్ బిష్ణోయ్ ముఠా మొదటిసారి కాదు బాలీవుడ్ ను టార్గెట్ చేస్తున్నది. ఇంతకు ముందు సల్మాన్ ఖాన్‌కు, షారూఖ్ ఖాన్‌కు కూడా ఇలాంటి threats వచ్చాయి. 1998లో జరిగిన blackbuck వేట కేసులో సల్మాన్ పై కాల్పులు, లేఖల ద్వారా బెదిరింపులు కూడా జరిగాయి. అలాగే పఠాన్ సినిమా టైంలో షారూఖ్ కు భద్రతా కారణాల వల్ల పెద్ద టెన్షన్ ఎదురైంది.
సిద్ధూ మూసేవాలా హత్యలో కూడా ఈ గ్యాంగ్ పేరు వచ్చింది. పంజాబీ సింగర్స్ ను టార్గెట్ చేయడం ఇప్పుడు కామన్ అయిపోయింది. తాజాగా అమీర్ ఖాన్ కేసు మరోసారి నిరూపించింది – ఏ సెలబ్రిటీ కూడా ఈ ముఠా నుండి సేఫ్ కాదు. వీళ్లు ఎవరినైనా ఎప్పుడైనా టార్గెట్ చేస్తారు అనే భయం బాలీవుడ్ లో ఇప్పుడు మామూలుగా లేదు.





