ప్రభాస్ నటించిన ‘ది రాజా సాబ్’ థియేటర్లలో ఆశించిన స్థాయిలో ఆడకపోయినా, ఓటీటీలో మాత్రం భారీ సంచలనం సృష్టించింది. ఈ సినిమా తాజాగా 17.5 మిలియన్ వ్యూస్ తో సౌత్ ఇండియన్ సినిమాల్లో టాప్ స్థానంలో నిలిచింది. ఆర్మాక్స్ స్ట్రీమ్ వ్యూ విడుదల చేసిన 2026 తొలి ఆరు నెలల రిపోర్ట్ లో ఈ విషయం వెల్లడైంది. ప్రేక్షకులు డిజిటల్ ప్లాట్ ఫామ్ లో ఈ సినిమాకు భారీ సపోర్ట్ ఇవ్వడం విశేషం.
The Raja Sab Creates Digital Storm
జియోహాట్ స్టార్ లో స్ట్రీమ్ అవుతున్న ‘ది రాజా సాబ్’ ఈ ఏడాది మొదటి అర్ధభాగంలో అత్యధిక వ్యూస్ సాధించిన సౌత్ సినిమాగా నిలిచింది. ఆర్మాక్స్ టాప్-10 జాబితాలో మలయాళం నుంచి నాలుగు, తమిళం నుంచి ‘బ్లాస్ట్’, ‘యూత్’ వంటి సినిమాలు ఉన్నాయి. తెలుగు నుంచి ‘అగ్లీ స్టోరీ’, ‘అఖండ 2’, ‘అర్జున్ సన్ వైజయంతి’ కూడా జాబితాలో చోటు దక్కించుకున్నాయి. కానీ ప్రభాస్ ను ఎవరూ ఓవర్ టేక్ చేయలేకపోయారు.
దర్శకుడు మారుతి ఈ హారర్-కామెడీ సినిమాను తెరకెక్కించాడు. ప్రభాస్ సరసన మాళవిక మోహనన్, నిధి అగర్వాల్, రిద్ధి కుమార్ కథానాయికలుగా నటించారు. థియేటర్లలో మిక్స్ అవుట్ పుట్ వచ్చినా, ఓటీటీలో ఈ సినిమాకు వచ్చిన రెస్పాన్స్ మాత్రం ఊహించని స్థాయిలో ఉంది. ఇది ప్రస్తుతం సినీ వర్గాల్లో హాట్ టాపిక్ గా మారింది.
ప్రభాస్ ప్రస్తుతం ‘ఫౌజీ’ సినిమా షూటింగ్ లో బిజీగా ఉన్నాడు. దీన్ని హను రాఘవపూడి డైరెక్ట్ చేస్తున్నారు. ఈ సినిమా తర్వాత సలార్ 2, కల్కి 2, స్పిరిట్ వంటి సినిమాల్లో నటించనున్నారు. ఇప్పటికే డిజిటల్ మార్కెట్ లో ప్రభాస్ కు ఉన్న క్రేజ్ ఈ సినిమా వ్యూస్ తో మరోసారి నిరూపితమైంది.





