అనకాపల్లి ట్రైలర్ విడుదలై ఇప్పటికే సినిమా లవర్స్‌లో క్యూరియాసిటీ పెంచేసింది. విక్రమ్ సాహిదేవ్, సంధ్యా వశిష్ట జంటగా ఈ సినిమా రూపొందుతుంది. ఖగేష్ తమ్మినేని డైరెక్షన్లో తెరకెక్కుతున్న ఈ ప్రాజెక్టులో పుష్ప 2 ఫేమ్ తారక్ పొన్నప్ప కూడా ముఖ్యమైన పాత్రలో నటిస్తున్నాడు. టాలీవుడ్ థండర్స్ టీం ద్వారా ఈ ట్రైలర్‌ని లాంచ్ చేయడం విశేషం.
Anakapalli Trailer Launched
ట్రైలర్ చూస్తుంటే ఇది లవ్ అండ్ యాక్షన్ కాంబినేషన్‌తో కట్ చేసినట్టు తెలుస్తోంది. హీరోహీరోయిన్ల మధ్య నయా లవ్ ట్రాక్, తారక్ పొన్నప్ప విలనిజం మెయిన్ ఎట్రాక్షన్‌గా కనిపిస్తోంది. మధ్యతరగతి ఫ్యామిలీ బ్యాక్‌గ్రౌండ్‌లో త్రినాథరావు నక్కిన, ఇంద్రజ తల్లిదండ్రుల పాత్రల్లో కనిపించబోతున్నారు. యూత్, మాస్ ఆడియన్స్‌కు ఈ సినిమా కనెక్ట్ అవుతుందని ట్రైలర్ హింట్ ఇస్తుంది.
ఈ సినిమాలో ఇంద్రజ అబ్బర్, మహబూబ్‌నగర్ భాషా, శ్రీనివాస్ వడ్లమాని వంటి నటులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. త్రినాథరావు నక్కిన, నాయుడు కాండ్రేగుల కలిసి ఈ సినిమాని నిర్మించారు. డావ్జాండ్ సంగీతం అందించాడు. పాటలు, యాక్షన్ సీక్వెన్స్‌లు బాగున్నాయి. ఈ సినిమా థియేటర్స్‌లో రిలీజ్ అయ్యాక పెద్ద హిట్ అవుతుందని ఎదురుచూస్తున్నారు.
మరి ఈ అనకాపల్లి ట్రైలర్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. మూవీ లవర్స్ అందరూ ఈ ట్రైలర్ ని ఇంప్రెస్ అవుతున్నారు. ఖచ్చితంగా ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద మంచి ఓపెనింగ్ తెస్తుంది. ఇప్పటికే ట్రైలర్ కి పాజిటివ్ రెస్పాన్స్ వస్తుంది. ఎవరైనా ట్విట్టర్ లింక్ ద్వారా ట్రైలర్ ని చూడొచ్చు. ట్వీట్: https://t.co/9u8zneZiG2





