
KTR Wife: కల్వకుంట్ల కుటుంబంపై పదేపదే ప్రచారం చేస్తున్న కాంగ్రెస్ సోషల్ మీడియా ఇప్పుడు కల్వకుంట్ల తారకరామారావు సతీమణి శైలిమా లగ్జరీ లైఫ్ పై సంచలన పోస్టులు పెడుతోంది. హరీష్ రావు తండ్రి దినకర్మ రోజున సతీ సమేతంగా కేటీఆర్ దంపతులు ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. అయితే ఈ సందర్భంగా కేటీఆర్ భార్య శైలిమా ఓ లగ్జరీ కారులో దిగారు. బీఎండబ్ల్యూ ( BMW i7 M70 xDrive) కారులో ఆమె వచ్చారు. ఈ కారు ధర 2.58 కోట్లు. KTR Wife
KTR wife in a luxury car
కేటీఆర్ కూడా ఇంత రేంజ్ లో కారు మైంటైన్ చేయడం లేదు. కానీ ఆయన భార్య శైలిమా మాత్రం బీఎండబ్ల్యూ కారులో ( BMW i7 M70 xDrive ) తిరుగుతోంది. దీంతో ఆమెకు ఇన్ని డబ్బులు ఎక్కడి నుంచి వచ్చాయని కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా రకరకాల పోస్టులు పెడుతోంది. జనవరి 2025 లోనే ఈ కారును కొనుగోలు చేసిందట కేటీఆర్ భార్య శైలిమా. అయితే ఎట్ హోం హాస్పిటల్ సర్వీసెస్ ప్రైవేట్ లిమిటెడ్ పేరుతో (AtHome Hospitality Services Pvt. Ltd) ఈ కారును కొనుగోలు చేశారట. అయితే ఆ కంపెనీకి కేటీఆర్ భార్యకు ఏం సంబంధం అని కాంగ్రెస్ కౌంటర్ ఇచ్చే ప్రయత్నం చేస్తుంది. KTR Wife
Also Read: BRS: జూబ్లీహిల్స్ లో BRS ఓడితే..KTR రాజీనామా చేయడమేనా.. హరీష్ కు బాధ్యతలు ?
అయితే దీనికి గులాబీ పార్టీ సోషల్ మీడియా కూడా కౌంటర్ ఇచ్చేసింది. ఆ కంపెనీలో 2014 నుంచే కేటీఆర్ ఫ్యామిలీకి వాటాలు ఉన్నాయి. అందులో డైరెక్టర్ గా కేటీఆర్ తో పాటు ఆయన భార్య శైలిమా కూడా ఉన్నారు. జోగినిపల్లి సంతోష్ కుమార్ కూడా ఇందులో ఉండడం గమనార్హం. అందుకే ఆ కంపెనీ పైన ఈ కారు కొనుగోలు చేసినట్లు గులాబీ పార్టీ అదిరిపోయే కౌంటర్ ఇచ్చింది. దీంతో గమ్మున కూర్చుంది కాంగ్రెస్ సోషల్ మీడియా. ఇది ఇలా ఉండగా కేటీఆర్ సతీమణి కల్వకుంట్ల శైలిమా ఆస్తుల వివరాలు ఒకసారి పరిశీలిస్తే… 2023 నాటి లెక్కల ప్రకారం 33.91 కోట్లు ఆమె కలిగి ఉన్నారట. శైలిమా పేరుపైన వ్యవసాయ భూములతో పాటు స్థిర అలాగే చరాస్తులు ఉన్నాయి. చాలా కంపెనీలలో ఆమెకు షేర్లు కూడా ఉన్నాయి. 2018 తో పోలిస్తే ఆమె ఆస్తులు భారీగానే పెరిగాయి. KTR Wife
Also Read: Jubilee Hills bypoll: మాగంటి గోపీనాథ్ కు అసలైన వారసులం మేమే..కాంగ్రెస్ స్కెచ్ అదుర్స్…





