BALKA SUMAN : బాల్క సుమ‌న్ కి బెయిల్.. కానీ ఆ ష‌ర‌తులు పాటించాల్సిందే..!

Balka Suman

BALKA SUMAN : ఇటీవ‌ల‌ మంచిర్యాల జిల్లా క్యాత‌న్ ప‌ల్లి మున్సిప‌ల్ చైర్మ‌న్ ఎన్నిక స‌మ‌యంలో అధికార కాంగ్రెస్, ప్ర‌తిప‌క్ష బీఆర్ఎస్ మ‌ధ్య ఉద్రిక్త ప‌రిస్థితులు జ‌రిగి జైలు వ‌ర‌కు వెళ్లిన విష‌యం విధిత‌మే. ఈ ఘ‌ట‌న‌లో బీఆర్ఎస్ నేత‌, మాజీ ఎమ్మెల్యే బాల్క సుమ‌న్ అరెస్ట్ అయ్యారు. గ‌త కొద్ది రోజులుగా ఆదిలాబాద్ జైలులో ఉన్నారు. తాజాగా బాల్క సుమ‌న్ కి ఊర‌ట ల‌భించింది. ఆయ‌న దాఖ‌లు చేసుకున్న బెయిల్ పిటిష‌న్ పై సుదీర్ఘ విచార‌ణ జ‌రిపిన త‌రువాత మంచిర్యాల జిల్లా కోర్టు బెయిల్ మంజూరు చేస్తూ ఉత్త‌ర్వులు వెలువ‌రించింది. BALKA SUMAN

BAIL TO BALKA SUMAN FORMER BRS MLA IN JAIL FOR 14 DAYS IN KYATHANPALLI INCIDENT

బాల్క‌సుమ‌న్ తో పాటు మ‌రో ముగ్గురికి కూడా బెయిల్ ఇచ్చింది కోర్టు. మున్సిప‌ల్ ఎన్నిక‌ల స‌మ‌యంలో ఫిబ్ర‌వ‌రి 18న మంత్రి గ‌డ్డం వివేక్ వెంక‌ట‌స్వామి, ఎంపీ గ‌డ్డం వంశీ కాన్వాయ్ పై దాడి చేసిన‌ట్టు బాల్క సుమ‌న్ పై ఆరోప‌ణ‌లు ఉన్నాయి. దీంతో కేసు న‌మోదు చేసిన‌ పోలీసులు బాల్క సుమ‌న్ ను అరెస్ట్ చేశారు. బాల్క సుమ‌న్ స‌హా మిగిలిన నిందితులు ఆదిలాబాద్ జైలులో రిమాండ్ ఖైదీలుగా ఉన్నారు. బెయిల్ పై విడుద‌లైన త‌రువాత ప్ర‌తీ ఆదివారం రామ‌కృష్ణాపూర్ పోలీస్ స్టేషన్ కి వెళ్లి హాజ‌రు కావాల‌ని ఆదేశాలు జారి చేసింది కోర్టు.

Also Read : TELANGANA : తెలంగాణ రైతుల‌కు గుడ్ న్యూస్.. స‌రికొత్త విప్ల‌వానికి రేవంత్ స‌ర్కార్ శ్రీకారం

క్యాత‌న‌ప‌ల్లి మున్సిపల్ చైర్మ‌న్ ఎన్నిక‌లో భాగంగా ఎక్స్ అఫీషియో ఓటు వినియోగించుకునేందుకు మంత్రి వివేక్, ఎంపీ వంవీ కాన్వాయ్ తో బ‌య‌లుదేర‌గా.. వారిపై బాల్క సుమ‌న్, బీఆర్ఎస్ నాయకులు దాడికి పాల్ప‌డ్డారు. ఈ ఘ‌ట‌న‌లో మంత్రి వివేక్ ఎంపీ వంశీ కారు అద్దాలు పూర్తిగా ధ్వంస‌మ‌య్యాయి. కాంగ్రెస్, బీఆర్ఎస్ శ్రేణుల మ‌ధ్య తీవ్ర వాగ్వాదం చోటు చేసుకుంది. దీంతో ప‌రిస్థితి ఉద్రిక్త‌త మారింది. ఈ క్ర‌మంలోనే బీఆర్ఎస్ నేత బాల్క సుమ‌న్ ను అరెస్ట్ చేశారు. 14 రోజుల త‌రువాత బెయిల్ మంజూరు చేసింది మంచిర్యాల కోర్టు.

Also Read : Dubai Airport Attacks: దుబాయ్‌లో చిక్కుకున్న మంత్రి తుమ్మల నాగేశ్వరరావు !

Visited 1 times, 1 visit(s) today

Leave a Comment