CM CHANDRABABU-MANCHU MANOJ : సీఎం చంద్ర‌బాబు పై మంచు మ‌నోజ్ ప్ర‌శంస‌లు.. ఎందుకోసం అంటే..?

CM CHANDRABABU-MANCHU MANOJ : ఆంధ్ర‌ప్ర‌దేశ్ సీఎం చంద్ర‌బాబు నాయుడు గురించి ప్ర‌త్యేకంగా చెప్పాల్సిన అవ‌స‌ర‌మే లేదు. సీఎంగా ఎంత‌టి సంచ‌ల‌న నిర్ణ‌యాలు తీసుకుంటారో.. ప్ర‌స్తుతం ఉన్న రాజ‌కీయ నేత‌లంద‌రికంటే కూడా సీఎం చంద్ర‌బాబు సీనియ‌ర్ నేత‌గా ఉండ‌టం విశేషం. ప్ర‌ధాని న‌రేంద్ర మోడీ కంటే కూడా చంద్ర‌బాబు సీనియ‌ర్ పొలిటిషియ‌న్. తాజాగా ఏపీ ప్ర‌భుత్వం కీల‌క నిర్ణ‌యం తీసుకుంది. CM CHANDRABABU-MANCHU MANOJ

Manchu Manoj praises CM Chandrababu

ముఖ్యంగా 13 సంవ‌త్స‌రాల లోపు పిల్ల‌ల‌కు సోష‌ల్ మీడియా యాక్సెస్ ను నియంత్రించేలా కీల‌క నిర్ణ‌యాలు కీల‌క నిర్ణ‌యం తీసుకున్నారు. అలాగే క‌ర్ణాట‌క ప్ర‌భుత్వం 16 సంవ‌త్స‌రాల లోపు పిల్ల‌ల‌కు సోష‌ల్ మీడియా బ్యాన్ చేసింది. సోష‌ల్ మీడియా యాక్సెస్ ను ఏపీలో రోడ్డు మ్యాప్ ను చొరువ తీసుకున్నారు సీఎం చంద్ర‌బాబు నాయుడు. దీనిపై తాజాగా టాలీవుడ్ న‌టుడు మంచు మ‌నోజ్ స్పందించారు.

Also Read : KALVAKUNTLA KAVITHA : కాలిన‌డ‌కన తిరుమ‌ల‌కు చేరుకున్న క‌విత‌.. సెన్షేష‌న్ కామెంట్స్

ట్విట్ట‌ర్ వేదిక‌గా మంచు మ‌నోజ్ ఓ పోస్ట్ చేశాడు. 13 సంవ‌త్స‌రాల‌లోపు పిల్ల‌ల‌కు సోష‌ల్ మీడియా యాక్సెస్ ను నియంత్రించేలా రోడ్డు మ్యాప్ రూపొందించ‌డానికి చొరువ తీసుకున్న సీఎం చంద్ర‌బాబు నాయుడు కి, అలాగే 16 ఏళ్ల లోపు పిల్ల‌ల సోష‌ల్ మీడియా వినియోగంపై ఆంక్ష‌లు విధించాల‌ని ప్ర‌తిపాదించిన క‌ర్ణాట‌క సీఎం సిద్ధ‌రామ‌య్య కి హృద‌య పూర్త‌క అభినంద‌న‌లు తెలిపారు మంచు మ‌నోజ్. ఇది చాలా ప్ర‌శంస‌నీయ‌మ‌ని.. యువ‌త ఆలోచ‌న దృక్ప‌థాన్ని ర‌క్షించే దిశ‌గా స‌రైన స‌మ‌యంలో తీసుకున్న ఆలోచ‌నాత్మ‌క నిర్ణ‌యాలుగా భావిస్తున్న‌ట్టు తెలిపారు.

Also Read : ANDHRA PRADESH: ఏపీ ప్ర‌భుత్వం సంచ‌ల‌న నిర్ణ‌యం.. 13 ఏళ్ల లోపు పిల్ల‌ల‌కు సోష‌ల్ మీడియా బ్యాన్..!