NEET 2026: రీ-నీట్ 2026 స్కోర్ కార్డుల్లో భారీ తేడాలు.. కోర్టుకెళ్లే యోచనలో విద్యార్థులు!!

నీట్ 2026 రీ-ఎగ్జామ్ ఫలితాలు విడుదలైనప్పటి నుంచీ విద్యార్థుల గోడు మళ్ళీ మొదలైంది. అసలు ఏప్రిల్ 16న వచ్చిన ఈ రీ-నీట్ 2026 స్కోర్‌కార్డుల్లో పెద్ద ఎత్తున మార్కుల తేడాలు కనిపించడంతో అభ్యర్థులు తీవ్ర నిరాశకు గురయ్యారు. చాలామంది తాము ఫైనల్ ఆన్సర్ కీ ప్రకారం ఊహించిన స్కోరుకు, అసలు వచ్చిన మార్కులకు ఆకాశానికీ భూమికీ మధ్య తేడా ఉందని చెబుతున్నారు. ప్రతిభా త్రివేది అనే స్టూడెంట్ 720కి 638 మార్కులు వస్తాయనుకుంటే కేవలం 38 మాత్రమే పడ్డాయని షాక్‌కు గురైంది. ఇలా కేవలం 5 లేదా 10 మార్కుల గ్యాప్ కాకుండా వందల మార్కుల తేడా రావడం అన్యాయమని ఆందోళన చెందుతోంది. తన OMR షీట్ చూపించాలని NTA కి రిక్వెస్ట్ చేసినా పెద్దగా రెస్పాన్స్ లేదు. దాదాపు 600 మంది తనలాగే ఇబ్బంది పడుతున్నారని, దీంతో ఇప్పుడు కోర్టు మెట్లెక్కే ఆలోచనలో ఉన్నారు.

NEET 2026 Score Mismatch Trouble

ఈ వివాదం మధ్య NTA విద్యార్థులపై సీరియస్ ఆరోపణలు చేస్తోంది. తమ మార్కులు తక్కువ పడ్డాయంటూ ఫిర్యాదు చేస్తున్న చాలామంది అభ్యర్థులు, తాము submit చేసిన OMR షీట్లను AI tools ద్వారా మార్పులు చేశారని ఏజెన్సీ ఆరోపిస్తోంది. అసలు ఇలాంటి తప్పుడు డాక్యుమెంట్లు submit చేయవద్దని విద్యార్థులను, పేరెంట్లను NTA హెచ్చరించింది. ఈ పరిణామాన్ని రాజకీయ నేతలు తీవ్రంగా తప్పు పడుతున్నారు. ఢిల్లీ మాజీ CM అరవింద్ కేజ్రీవాల్ స్పందిస్తూ, ఫలితాల్లో తప్పులను దాచేందుకు NTA బెదిరింపులకు దిగుతోందని విమర్శించారు. స్టూడెంట్స్ తమ స్కోరు తేడాపై ఫిర్యాదు చేస్తే, వాళ్ళు సృష్టించిన OMR షీట్లంటూ NTA బెదిరించడం ఎంతవరకు సబబు అని ఆయన ప్రశ్నించారు.

ఇదే సమయంలో మరో ఆసక్తికరమైన అంశం బయటకు వచ్చింది. 71 ఏళ్ల అశోక్ బహర్ అనే సీనియర్ సిటిజన్, MBBS అడ్మిషన్లలో వృద్ధులకు కూడా reservation లేదా ప్రత్యేక కోటా ఎందుకు ఉండకూడదని అలహాబాద్ హైకోర్ట్ లక్నో బెంచ్‌ను ఆశ్రయించారు. NEET రాయడానికి వయో పరిమితి లేని ఈ టైమ్‌లో, సీనియర్ సిటిజన్లకు కూడా మెడికల్ సీట్ల కోసం ప్రత్యేక అవకాశం కల్పించాలని, కనీసం 1 శాతం రిజర్వేషన్ పెట్టాలని ఆయన రిట్ పిటిషన్ దాఖలు చేశారు. అన్ని వర్గాలకు రిజర్వేషన్ ఉన్నప్పుడు సీనియర్ సిటిజన్లను ఎందుకు పట్టించుకోవడం లేదని ఆయన ప్రశ్నించారు. ఈ కేసు ఈ నెల 21న విచారణకు రాబోతోంది.

మొత్తంగా రీ-నీట్ ఫలితాల అనంతరం విద్యార్థులు ఒకవైపు, సీనియర్ సిటిజన్లు మరోవైపు తమ హక్కుల కోసం న్యాయపోరాటం చేయాల్సిన పరిస్థితి వచ్చింది. మొదట స్కోర్ మ్యాచింగ్ సమస్యలతో కొట్టుమిట్టాడుతున్న యువతరం, ఇప్పుడు NTA వ్యవహరించే తీరుతో మరింత ఆందోళన చెందుతోంది. స్టూడెంట్స్‌కు సపోర్ట్ చేస్తూ న్యాయం కోసం ఎవరెవరు కోర్టు మెట్లెక్కితే పరిస్థితి సద్దుమణుగుతుందో చూడాలి. రానున్న రోజుల్లో కోర్టు తీర్పుపైనే అందరి దృష్టీ నెలకొంది.

Share your love