Electric Bike : ఈరోజుల్లో ఎలక్ట్రిక్ వాహనాలు ఎక్కువైపోయాయి. చాలామంది ఎలక్ట్రిక్ వెహికల్స్ ని వాడుతున్నారు. అల్ట్రా వైలెట్ సంస్థ దేశం లో కొత్త ఎలక్ట్రిక్ మోటార్ సైకిల్స్ ని తీసుకు వచ్చింది కస్టమర్లకి బైక్ ని స్టాండర్డ్ అలానే రీకాన్ రెండు వేరియంట్లని ఇస్తోంది దీనికి సంబంధించి పూర్తి వివరాలను చూద్దాం.. Ultraviolette సంస్థ F77 Mach 2 ఇ-బైక్ కేవలం 2.8 సెకన్లలో గంటకు 0 నుండి 100 కిలోమీటర్ల వేగాన్ని ఇస్తుంది. దీని గరిష్ట వేగం గంటకు 155 కి.మీ. ఇది టెస్లా ఎలక్ట్రిక్ కారు కంటే మూడు రెట్లు స్పీడ్ గా ఉంటుంది. టెస్లా కారు 100 kmph వేగాన్ని అందుకోవడానికి 5.6 సెకన్లు పడుతుంది. ఈ ఎలక్ట్రిక్ బైక్‌ కి వైలెట్ AI మద్దతు వుంది.

Electric Bike with super features

దాని హెల్ప్ తో మీరు బైక్ నుండి పడిపోయే అవకాశం ఉంటే మీకు హెచ్చరిక వస్తుంది. రిమోట్ లాక్‌డౌన్, క్రాష్ అలర్ట్, డైలీ రైడింగ్ స్టేటస్, యాంటీ కొలిజన్ వార్నింగ్ సిస్టమ్ కూడా దీనిలో ఉన్నాయి. ఈ బైక్ 10.3kWh బ్యాటరీ ప్యాక్ ని కలిగి ఉంది. 40.2బిహెచ్‌పి పవర్, 100ఎన్ఎమ్ టార్క్ ని ఉత్పత్తి చేస్తుంది. బైక్ ఫుల్ ఛార్జింగ్‌తో 323 కిలోమీటర్ల దాకా నడుస్తుంది. కొత్త అల్ట్రా వైలెట్ ఇ-బైక్‌ లో 3-స్థాయి ట్రాక్షన్ కంట్రోల్ సిస్టమ్ తో పాటు 10-లెవల్ రీజెనరేటివ్ సిస్టమ్ ఉన్నాయి.

Also read: Smartphone: ఈ ఏడాది లాంచ్‌ అయిన బెస్ట్ స్మార్ట్ఫోన్స్.. బడ్జెట్ లోనే..!

హిల్ హోల్డ్ అసిస్ట్, యాంటీ-లాక్ బ్రేకింగ్ సిస్టమ్, డెల్టా వాచ్, డైనమిక్ స్టెబిలిటీ కంట్రోల్ ఇలా పలు భద్రతా లక్షణాలను కలిగి వుంది. ఈ ఎలక్ట్రిక్ బైక్‌ కి వైలెట్ AI మద్దతు వుంది. బైక్ నుండి పడిపోయే అవకాశం ఉన్నప్పుడు హెచ్చరిక వస్తుంది. రిమోట్ లాక్‌డౌన్, క్రాష్ అలర్ట్, డైలీ రైడింగ్ స్టేటస్, యాంటీ కొలిజన్ వార్నింగ్ సిస్టమ్ దీనిలో ఉన్నాయి. బైక్ స్టాండర్డ్ వేరియంట్ ధర రూ.2.99 లక్షలు, రీకాన్ వేరియంట్ ధర రూ.3.99 లక్షలు (Electric Bike).

Join WhatsApp