Traffic: ప్రధాన నగరాల్లో ట్రాఫిక్ అనేది పెద్ద సమస్య. పెరుగుతున్న పట్టణీకరణ చదువులు ఉద్యోగాల కోసం అందరూ నగరాలకు వెళ్ళిపోతున్నారు. ఈ కారణంగా రోజురోజుకీ రోడ్లు రద్దీగా మారుతున్నాయి. ట్రాఫిక్ లో ప్రయాణించాలని అనుకుంటే ఎవరికైనా ఇబ్బందిగా ఉంటుంది ఈ సమయంలో వాహనదారులకి ఓపిక చాలా అవసరం. హైదరాబాద్ బెంగళూరు చెన్నై ముంబై ఢిల్లీ వంటి నగరాల్లో నిత్యం ట్రాఫిక్ సమస్యలు కనబడుతూ ఉంటాయి. గంటల తరబడి ట్రాఫిక్ లో ఎదురు చూస్తూ ఉండాలి.

Traffic mistakes which we shouldn’t do

ట్రాఫిక్ ని తగ్గించడానికి ఫ్లై ఓవర్లు మెట్రోలు అండర్పాస్ లు వచ్చినా కూడా సమస్య ఉంటూనే ఉంది. ట్రాఫిక్ లో ఉన్నప్పుడు వాహనదారులు జాగ్రత్తగా ఉండాలి అలానే ఓపిగ్గా ఉండాలి కొందరు గ్రీన్ సిగ్నల్ పడక ముందు వాహనాన్ని స్టార్ట్ చేస్తారు. ఇంకొంతమంది. హారన్ కొడుతూ ఉంటారు. ట్రాఫిక్ లో ఉన్నప్పుడు సెల్ ఫోన్ ఆఫ్ చేయడం లేదా సైలెంట్ మోడ్ లో ఉంచుకోవాలి. తర్వాత మీ కార్లో మీకు ఇష్టమైన మ్యూజిక్ ప్లే చేసి లో వాల్యూమ్ లో ఉంచుకోండి.

Also read: Chandra babu : నెల్లూరు లో గల్లీ గల్లీ తిరిగారు పవన్..!

చాలామంది హై వాల్యూం పెడుతూ ఉంటారు అంబులెన్స్ హార్న్ శబ్దాలు మీ బ్రెయిన్ కి ఒత్తిడి కలిగించకుండా ప్రశాంతంగా ఉండాలంటే ఇలా లో వాల్యూమ్ పెట్టుకోండి కొన్నిసార్లు ఓపిక లేని డ్రైవర్లు వేగంగా ప్రమాదకరంగా డ్రైవ్ చేస్తూ ఉంటారు ఇది చాలా ప్రమాదకరమని గుర్తుపెట్టుకోండి. ఎప్పుడు అప్రమత్తంగా ఉండాలి. డ్రైవింగ్ చేసేటప్పుడు కూడా మీరు మీ లేన్ లో ఉండడానికి ప్రయత్నం చేయండి టర్నింగ్ ఇండికేటర్లని ఆన్ చేయడం మర్చిపోవద్దు ట్రాఫిక్ జామ్ లేని రోడ్లమీద ప్రయాణం చేసే విధంగా మీరు చూసుకోండి. దీంతో త్వరగా మీరు మీ గమ్యస్థానాన్ని చేరుకోవచ్చు. ట్రాఫిక్ బ్లాకు వద్ద ముందు ఉన్న వాహనం నుండి ఎప్పుడు సురక్షితమైన దూరం ఉండేటట్టు జాగ్రత్తగా ఉండాలి (Traffic).

Join WhatsApp