Car: చాలామంది ఈ రోజుల్లో కారు మీద ట్రావెల్ చేస్తున్నారు. ఎక్కువగా కారులని కొనుగోలు చేస్తున్నారు, మీరు కూడా కారుని కొనుగోలు చేశారా..? కారు మైలేజ్ విషయంలో ఇబ్బందులు రాకుండా ఉండాలంటే ఏం చేయాలి అని చూస్తున్నారా..? కారు కానీ బైకు కానీ మైలేజ్ విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలి. మైలేజ్ సరిగ్గా లేకపోతే ఎన్నో సమస్యలు ఎదుర్కొంటుంటారు. వాహనం పాత పడుతున్న కొద్ది మైలేజ్ సరిగ్గా రాదని చాలామంది అంటూ ఉంటారు. మంచి మైలేజీ కోసం మనం కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. బండి పాతదైనా కొత్తదైనా కొన్ని చిట్కాలని పాటించాలి.

Car mileage tips

శరీరాన్ని ఎనర్జిటిక్గా ఉంచుకోవడానికి ఆరోగ్య సూత్రాలను ఎలా పాటిస్తామో ఈ విషయాలని పాటిస్తే మైలేజ్ సరిగ్గా ఉంటుంది. మంచి మైలేజ్ రావాలంటే వాహనం ఎప్పుడూ నిర్ణీత వేగంలో నడపాలి. 50 నుండి 60 km నడిపినప్పుడు మంచి మైలేజీని ఇస్తాయి. వేగం ఈ స్థాయి కంటే పెరిగింది అంటే మైలేజ్ తగ్గుతుంది. గంటకి 100 కిలోమీటర్ల వేగంతో వెళ్లడం కంటే స్థిరంగా 50 నుండి 60 కిలోమీటర్ల వేగంతో వెళితే 25 శాతం మైలేజీ అధికంగా వస్తుంది.

Also read: Galaxy S23: రూ.90 వేల ఫోన్‌ను.. రూ. 45వేలకే పొందొచ్చు..!

మంచి ఆరోగ్యం కోసం హెల్త్ చెకప్ చేయించుకుంటున్నట్లు సర్వీసింగ్ చేయించుకోవాలి. ఎప్పుడూ కూడా టైర్లలో నిర్ణీత స్థాయిలో గాలి ఉండేటట్టు చూసుకోవాలి ఇది చాలా ముఖ్యం ఇంజన్ ఎప్పుడు కూడా ఎలా ఉందో చూసుకోవాలి బైక్ మీద కారు మీద భారం ఎక్కువ రోడ్డుకి టైర్లకి మధ్య ఘర్షణ పెరిగే మైలేజీ తగ్గిపోతుంది. వాహనం టాప్ గేర్ లో ఉన్నప్పుడే మంచి మైలేజీ వస్తుంది ఫస్ట్ సెకండ్ గేర్ లో ఎక్కువ సేపు నడిపితే ఖర్చవుతుంది.

Join WhatsApp