
Eating: నేటి కాలంలో చాలామంది బిజీ లైఫ్ కారణంగా తొందర తొందరగా భోజనం చేస్తారు. ఇక చాలావరకు కొంతమంది మధ్యాహ్న సమయంలో రాత్రి సమయాలలో బయట ఎక్కువగా తింటూ ఉంటారు. బయట తినే సమయంలో ఎక్కువగా బిర్యానీలు, మసాలా ఫుడ్, ఫాస్ట్ ఫుడ్ లను ఎక్కువగా తింటారు. అయితే బయట తినే ఇలాంటి ఫుడ్ లలో మసాలాలు అధికంగా కలుపుతారు. అవి ఆరోగ్యానికి అస్సలు మంచిది కాదని తెలిసినప్పటికీ ప్రతి ఒక్కరూ రుచికి ప్రాముఖ్యతను ఇచ్చి తింటూ ఉంటారు. అయితే ఇలాంటి మసాలాలు ఎక్కువగా ఉన్న ఆహారం తింటున్న సమయంలో కొంతమందికి చెమటలు అధికంగా వస్తూ ఉంటాయి. చెమటలు వచ్చినప్పటికీ ఆ విషయాన్ని పక్కన పెట్టేసి తొందర తొందరగా రుచిగా ఉందని తింటూ ఉంటారు. Eating
Be careful if you sweat while eating chicken, mutton, and biryani
అయితే ఇలా తినడం వల్ల ఆరోగ్యానికి అస్సలు మంచిది కాదని వైద్యులు చెబుతున్నారు. మసాలా ఫుడ్ తింటున్న సమయంలో పొరపాటున కూడా చెమటలు వచ్చినట్లయితే మనం తినే ఆహారాన్ని అక్కడితోనే ఆపేయాలని వైద్యులు సూచనలు చేస్తున్నారు. పొరపాటున కూడా చెమటలు వచ్చినప్పటికీ పట్టించుకోకుండా ఆహారం తిన్నట్లయితే దానివల్ల ప్రాణానికే ప్రమాదం వాటిల్లుతుంది. మసాలా ఐటమ్స్ తింటున్నప్పుడు చెమటలు వచ్చినట్లయితే అది మన ఆరోగ్యానికి హానికరం. ఎందుకంటే మసాలా ఫుడ్ శరీరానికి పడకపోవడం వల్లనే చెమటలు వస్తాయి. ఇది మన బ్రెయిన్ ఇచ్చే గ్రీన్ సిగ్నల్. మనం ఆహారం తింటున్నప్పుడు చెమటలు రావడానికి గల కారణం మసాలా ఫుడ్ శరీరానికి పడడం లేదని బ్రెయిన్ మనకు ఇచ్చే సలహా అని వైద్యులు చెబుతున్నారు. ఆ సమయంలో చెమటలు వచ్చిన వెంటనే మనం తీసుకునే ఆహారాన్ని అంతటితో ఆపేయాలి.
Also Read: Harshit Rana: టీమిండియా ప్లేయర్లు బస్సులో, హర్షిత్ రాణా మాత్రం ఓ రేంజ్ లో…
అదే పనిగా తిన్నట్లయితే గుండె సంబంధ సమస్యలు వచ్చే అవకాశాలు అధికంగా ఉంటాయి. కడుపులో మంట, కళ్ళు తిరగడం లాంటి సమస్యలు అధికమవుతాయి. మసాలా ఫుడ్ అధికంగా తిన్నప్పుడు రక్తపోటు సమస్యలు పెరుగుతాయి. దానివల్ల మన శరీరంలో రక్త ప్రసరణ వేగవంతం అయ్యి గుండె వేగాన్ని పెంచుతుంది. ఆ కారణంగా గుండె పోటు, గుండె సంబంధ సమస్యలు అధికమవుతాయి. గుండె చుట్టూ మసాలా ఫుడ్ చేరుకొని గుండె కొట్టుకోవడం ఒక్కసారిగా ఆగిపోతుంది. దానివల్ల క్షణంలోనే ప్రాణాలను కోల్పోయే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఆ కారణంగా మసాలా ఫుడ్ కు ఎంత దూరంగా ఉంటే అంత మంచిదని వైద్యులు చెబుతున్నారు. నెలలో ఒక్కసారి మాత్రమే మసాలా ఫుడ్ తీసుకోవాలని అంతకుమించి తిన్నట్లయితే ప్రాణానికే ముప్పు వాటిల్లుతుందని చెబుతున్నారు.
Also Read: Fish: చేపలతో వీటిని తిన్నట్లయితే ప్రాణానికే ప్రమాదమా…ఇవి తెలుసుకోండి ?

