Again Special FD scheme is available

Sukanya Samriddhi Yojana : ఈరోజుల్లో ప్రతి ఒక్కరు కూడా భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని ఎంతో కొంత డబ్బుల్ని ఆదా చేస్తున్నారు. కేంద్ర ప్రభుత్వం కూడా అనేక రకాల పథకాలని తీసుకు వస్తోంది. కేంద్ర ప్రభుత్వం అందిస్తున్న స్కీముల వలన చాలామంది ప్రయోజనాన్ని పొందుతున్నారు ప్రధాని నరేంద్ర మోదీ నేతృత్వంలో కేంద్ర ప్రభుత్వం ఎన్నో గొప్ప పథకాలను తీసుకువచ్చింది. వీటిలో పెట్టుబడితో లాంగ్ రన్ లో మంచి రిటర్న్స్ వస్తాయని చెప్పొచ్చు ముఖ్యంగా వడ్డీ ఆదాయం వస్తుంది బ్యాంక్ డిపాజిట్లు ఇతర స్కీములతో పోల్చుకుంటే వీటిల్లో డబ్బులు సురక్షితమని చెప్పొచ్చు.

Sukanya Samriddhi Yojana full details

కేంద్రం గ్యారెంటీ ఉంటుంది కనుక రిస్క్ అయితే ఉండదు పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్ అనేది అత్యంత ఆధారణ పొందిన స్కీం. 7.1 0% వడ్డీ అందిస్తుంది వడ్డీ రేటును మూడు నెలలకు ఒకసారి మారుస్తూ ఉంటారు. కనిష్టంగా 500 గరిష్టంగా లక్షన్నర ఇన్వెస్ట్ చేయొచ్చు 15 సంవత్సరాలు పెట్టుబడి పెట్టాల్సి ఉంటుంది. ఇక సీనియర్ సిటిజన్ సేవింగ్స్ స్కీం విషయానికి వస్తే ఈ స్కీం లాకింగ్ పీరియడ్ ఐదేళ్లు. 60 ఏళ్లు పైబడిన ఇన్వెస్టర్లకు అందుబాటులో ఉంటుంది గరిష్టంగా 30 లక్షల దాకా ఇన్వెస్ట్ చేయొచ్చు కనీసం 1000 పెడితే సరిపోతుంది. సెక్షన్ 80 కింద అధిక సంవత్సరంలో లక్షన్నర టాక్స్ తగ్గించుకోవచ్చు.

Also read: Chandra Babu: నాది పునర్జన్మ..!

అలానే నేషనల్ సేవింగ్ సర్టిఫికెట్ లో కనీసం 1000 నుండి పెట్టుబడి పెట్టాల్సి ఉంటుంది దీంట్లో వడ్డీ రేటు 7.7 శాతం గా ఉంది. పోస్ట్ ఆఫీస్ టైం డిపాజిట్లు కూడా మంచి ఆప్షన్ అని చెప్పొచ్చు. దీంట్లో ఏడాది రెండేళ్లు అలానే మూడు ఐదు ఏళ్ళ కాలపరిమితితో ఉంటాయి. ఐదేళ్లు టైం డిపాజిట్ లో మాత్రమే టాక్స్ బెనిఫిట్ ని పొందొచ్చు. వడ్డీ 7.5% గా ఉంది ఆడపిల్లల కోసం కేంద్రం తీసుకొచ్చిన బెస్ట్ స్కీమ్స్ సుకన్య సమృద్ధి యోజన. 8.20 శాతం వడ్డీ రేటు తో పాటుగా టాక్స్ బెనిఫిట్ కూడా ఉంటుంది. కనీసం 250 ఇన్వెస్ట్ చేయాలి గరిష్టంగా లక్షన్నర వరకు పెట్టచ్చు (Sukanya Samriddhi Yojana).

Again Special FD scheme is available
Join WhatsApp