BSNL: ఇండియా లో ప్రస్తుతం టెలికాం సంస్థల్లో ముకేశ్ అంబానీ కి చెందిన రిలయన్స్ ఇండస్ట్రీస్ సబ్సిడీ రిలయన్స్ జియో సహా భారతీయ ఎయిర్టెల్ హవా నడుస్తోంది. మిగతా వాటి హవా జియో రాక తర్వాత తగ్గిందని చెప్పచ్చు. వీటిలోనే ప్రభుత్వరంగా దిగ్గజ టెలికాం కంపెనీ బిఎస్ఎన్ఎల్ కూడా ఉంది. అయితే టెలికాం నెట్వర్క్ ప్రస్తుతం ఫైవ్ జీ నడుస్తూ తర్వాత జనరేషన్ కోసం ఆలోచిస్తుంటే ఇది మాత్రం ఇంకా 3జి దగ్గరే ఉండిపోయింది.

BSNL users good news

ఇన్నాళ్లకు బీఎస్ఎన్ఎల్ నుండి ఒక అదిరిపోయే ప్రకటన అయితే వచ్చింది. ఎట్టకేలకు 4జి సర్వీస్ ను ప్రారంభించడానికి సిద్ధమైంది. ఆగస్టు నుండి బీఎస్ఎన్ఎల్ దేశ వ్యాప్తంగా ఫోన్ చేసి అందుబాటులోకి తీసుకు రాబోతుంది. కేంద్ర ప్రభుత్వం ఆత్మ నిర్భర భారత అడుగులకి అనుగుణంగా డెవలప్మెంట్ చేసిన సాంకేతిక తోనే ఈ సేవల్ని తీసుకొస్తున్నట్లు తెలుస్తోంది.

Also read: Nothing Phone: భారత్‌లో నథింగ్‌ ఫోన్‌ 2ఏ స్పెషల్‌ ఎడిషన్‌..!

పంజాబ్ లో ఇది వరకే బిఎస్ఎన్ఎల్ 4g సేవలు స్టార్ట్ చేసింది భారత్లోని అతిపెద్ద ఐటీ కంపెనీ టీసీఎస్ ప్రభుత్వం గా పరిశోధన సంస్థ సి డాట్ కలిసి సంయుక్తంగా డెవలప్ చేశాయి. పంజాబ్లో సి డాట్ అభివృద్ధి చెసిన సాంకేతిక మెరుగైన పనితీరు నమోదు చేస్తుందని సీనియర్ అధికారి చెప్పారు. భారత్లో 4జి నెట్వర్క్ విస్తరణ కోసం తేజస్ ప్రభుత్వానికి సంబంధించి ఐటీఐ సంయుక్తంగా బీఎస్ఎన్ఎల్ నుండి 19వేల కోట్లు విలువైన ఆర్డర్ సొంతం చేసుకున్నాయి (BSNL).

Join WhatsApp