ఏపీలో ప్రభుత్వ ఉద్యోగుల జీతాల విషయంలో ఒకప్పుడు చాలా గందరగోళం ఉండేది. జగన్ సర్కార్ టైంలో నెల వేతనాలు ఆలస్యం కావడం, పెండింగ్లో పడటం రొటీన్ అయిపోయింది. ఈ టెన్షన్ ఉద్యోగులను విపరీతంగా ఇబ్బంది పెట్టేది. కానీ ఇప్పుడు సీన్ పూర్తిగా మారిపోయింది. ఎందుకంటే Government Jobs కలిగిన వారికి ప్రతీ నెలా మొదటి తేదీ రోజునే జీతం పడేలా కొత్త రూల్ తీసుకొచ్చారు. ఇది ఉద్యోగుల్లో కొత్త ఉత్సాహం నింపేసింది.
Government Jobs Salary Timely Update
గతంలో జీతాల డిలే వల్ల ఉద్యోగులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. రోజువారీ ఖర్చులు, పిల్లల ఫీజులు, ఇంటి అద్దె ఇలా ప్రతీదీ మేనేజ్ చేయడం కష్టంగా మారింది. అసంతృప్తితో చాలా మంది ఆందోళనల వైపు వెళ్లారు కూడా. కానీ చంద్రబాబు నాయుడు ఈ ఇష్యూను సీరియస్గా తీసుకున్నారు. ఎన్నికల ముందు ఇచ్చిన ప్రామిస్ని నిలబెట్టుకోవడానికి ఆయన స్పెషల్ ఫోకస్ పెట్టారు. ఫలితంగా, ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన మొదటి ఏడాది సకాలంలోనే salary అందించారు.
కానీ తర్వాత మళ్లీ కొన్ని డిపార్ట్మెంట్లలో జీతాలు లేట్ అవడం స్టార్ట్ అయింది. ముఖ్యంగా కాంట్రాక్ట్ మరియు ఔట్ సోర్సింగ్ ఉద్యోగుల paymets చాలా నెలలు పెండింగ్లో ఉండిపోయాయి. స్కీం వర్కర్ల పరిస్థితి ఇంకా దారుణంగా ఉండేది. దీంతో మళ్లీ తిరగబాటు మొదలైంది. ఈ నెగెటివిటీని గమనించిన సీఎం చంద్రబాబు, ఉద్యోగుల్లో నమ్మకం కలిగించడానికి వెంటనే యాక్షన్ మోడ్లోకి వెళ్లారు. ఆర్థిక శాఖ ద్వారా కీలక ఆదేశాలు పంపించారు. ఇకపై ప్రతి ఉద్యోగికి నెల మొదటి తేదీనే జీతం అందేలా చూడాలని నిర్దేశించారు. జీతాల బిల్లును సకాలంలో IFMS పోర్టల్లో అప్డేట్ చేయాలని అన్ని కార్యాలయాలకు మెమో వెళ్లింది. చేయని పక్షంలో DDO పై చర్యలు తప్పవని హెచ్చరించడంతో ఆఫీసుల్లో ఇప్పుడు బిల్లుల అప్డేట్ పనులు యుద్ధ ప్రాతిపదికన జరుగుతున్నాయి.
మరోవైపు, కేంద్ర ప్రాయోజిత పథకాల్లో లక్ష మందికి పైగా పని చేస్తున్న ఉద్యోగుల జీతాల బాధ్యత ఆయా డిపార్ట్మెంట్ హెడ్లపై పెట్టడం వివాదంగా మారింది. కేంద్రం నుండి నిధులు రాబట్టాల్సిన బాధ్యత ఈ శాఖాధిపతులదే అని ప్రభుత్వం స్పష్టం చేసింది. కానీ ఉద్యోగ సంఘాలు మాత్రం ఇది ప్రభుత్వం తన బాధ్యత తప్పించుకోవడమేనని తీవ్రంగా విమర్శిస్తున్నాయి. వాళ్ల డిమాండ్ సింపుల్, ప్రతి ఒక్కరి జీతం ఒకే తేదీన పడాలి, ఆలస్యం అస్సలు జరగకూడదు. ఏది ఏమైనా, చంద్రబాబు ప్రభుత్వం ఈ కొత్త విధానాన్ని సక్సెస్ చేస్తే మాత్రం, ఉద్యోగులు చాలా రిలీఫ్ ఫీల్ అవుతారు. ఇప్పుడు అందరి కళ్లూ ఈ నెల మొదటి తేదీ మీదనే ఉన్నాయి.
https://x.com/pakkafilmy007/status/1600352362639822848





