
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడి భద్రత కోసం కూటమి ప్రభుత్వం భారీగా నిధులు కేటాయించింది. Chandrababu konvoy కోసం రూ.18.66 కోట్లు ఖర్చు చేస్తూ కేవలం రెండు రోజుల్లో మూడు ప్రభుత్వ ఉత్తర్వులు (GOలు) జారీ చేసింది. సీఎం సెక్యూరిటీని మరింత స్ట్రాంగ్ చేయడానికి ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.
Chandrababu konvoy security spending
ఈ నిధులను మూడు కేటగిరీలుగా డివైడ్ చేశారు. అధునాతన జామర్ వాహనాల కోసం రూ.12.28 కోట్లు, సాధారణ జామర్ వాహనాల కోసం రూ.3.74 కోట్లు, ఫార్చూనర్ లగ్జరీ ఎస్కార్ట్ కార్ల కోసం రూ.2.64 కోట్లు కేటాయించారు. మొత్తంగా ఈ మూడు ఆర్టికల్స్‌కు రూ.18.66 కోట్లు అవుతుంది. సీఎం కాన్వాయ్‌లో జామర్ వాహనాలు కీలకమైనవి. ఎందుకంటే శత్రువుల నుండి వైర్‌లెస్ లేదా రిమోట్ దాడులను ఎదుర్కోవడానికి ఇవి హెల్ప్ చేస్తాయి.
గతంలో చంద్రబాబు కాన్వాయ్‌లో పొదుపు కోసం కుదింపు చేశారంటూ విమర్శలు వచ్చాయి. కానీ ఇప్పుడు ఏకంగా రూ.19 కోట్ల దాకా ఖర్చు పెట్టడంపై సోషల్ మీడియాలో ట్రోల్స్ వస్తున్నాయి. ఈ భారీ ఖర్చు ఎందుకు అవసరం అని ప్రజలు ప్రశ్నిస్తున్నారు. కొందరు మాత్రం సీఎం సెక్యూరిటీ విషయంలో ఎటువంటి కాంప్రమైజ్ చేయకూడదని సపోర్ట్ చేస్తున్నారు.
ఏపీ ప్రభుత్వం మాత్రం నిఘా వర్గాల సూచనల మేరకు ఈ నిధులు కేటాయించినట్లు క్లారిటీ ఇచ్చింది. మొత్తానికి చంద్రబాబు కాన్వాయ్ ఇప్పుడు మరింత లగ్జరీగా, సెక్యూర్‌గా మారింది. కానీ ఈ ఖర్చు రాజకీయంగా మాత్రం హాట్ టాపిక్‌గా మారింది.





