Chandrababu: రుణమేళాలో నిర్మల సీతారామన్.. హామీలు నిలబెట్టుకుంటున్న చంద్రబాబు!!

మరోసారి హామీల ప్రస్తావన తెచ్చిన సీఎం

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ తాము ఇచ్చిన మాటకు కట్టుబడి పాలన చేస్తున్నామని అన్నారు. రుణమేళా కార్యక్రమంలో కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మల సీతారామన్ తో కలిసి పాల్గొన్న సీఎం, గత ప్రభుత్వ హయాంలో రాష్ట్రం అన్ని విధాలా నాశనమైందని వ్యాఖ్యానించారు.

Andhra Pradesh CM on loan mela

సీఎం చంద్రబాబు మాట్లాడుతూ ఎన్నికల ముందు ప్రజలకు ఇచ్చిన హామీలను అడుగడుగునా నిలబెట్టుకుంటున్నామని అన్నారు. పల్నాడు జిల్లా నరసరావుపేటలో జరిగిన ఈ రుణమేళాలో పలువురికి banks నుంచి తక్కువ interest రేట్లకు రుణాలు అందించారు. లబ్ధిదారులకు నిర్మల సీతారామన్ మరియు సీఎం స్వయంగా ఆ పత్రాలు అందించారు. డ్వాక్రా సంఘాల మహిళలకు 25 పైసల interest కే రుణాలు ఇప్పిస్తున్నామని, వడ్డీని కూడా ప్రభుత్వమే భరిస్తోందని చెప్పారు.

వైసీపీ హయాంలో ప్రైవేటు వ్యాపారాలు 10, 20 రూపాయల వడ్డీలకు రుణాలిచ్చి ప్రజల రక్తం పీల్చాయని సీఎం ఆరోపించారు. ఇప్పుడు కూటమి ప్రభుత్వం banks తో మాట్లాడి తక్కువ వడ్డీ రేట్లకే రుణాలు ఇచ్చే సౌకర్యం కల్పించిందని అన్నారు. చిన్న, సూక్ష్మ, మధ్య తరహా పరిశ్రమలు ఏర్పాటు చేసుకునే వారికి కూడా ఈ సదుపాయం ఉంది.

చివరగా, నిర్మల సీతారామన్ ను ఆదర్శంగా తీసుకోవాలని సీఎం సూచించారు. ఆర్థిక వ్యవస్థను గాడిలో పెట్టడంలో ఆమెకు తిరుగులేదని కొనియాడారు. డ్వాక్రా సంఘాలు, ఇతర స్వయం సహాయక సంఘాల మహిళలు నిర్మలమ్మా లాగా ఆర్థిక ప్రణాళికలు వేసుకుని ఎదగాలని సూచించారు. ఇది మహిళా సాధికారతకు పెద్ద పీట వేసే ప్రభుత్వం అని సీఎ� తెలిపారు.

Visited 1 times, 1 visit(s) today

Leave a Comment