Chennai Love Story: కిరణ్ అబ్బవరం షాకింగ్ కామెంట్స్ – సాయి ధరమ్ తేజ్ సంబరాల ఏటిగట్టు హిట్టా?

Kiran Abbavaram with Sai Dharam Tej

2026లో వస్తున్న సినిమా ‘చెన్నై లవ్ స్టోరీ’ హీరో కిరణ్ అబ్బవరం తన ఇంటర్వ్యూలో సాయి ధరమ్ తేజ్ సినిమా ‘సంబరాల ఏటిగట్టు’పై షాకింగ్ కామెంట్స్ చేశాడు. ఆ సినిమా మొదట తనకే ఆఫర్ అయిందని, కానీ బడ్జెట్ పెరిగిపోవడంతో తను వద్దనుకున్నట్టు చెప్పాడు.

Kiran Abbavaram Sambarala Ettigattu Shock

కిరణ్ అబ్బవరం మాట్లాడుతూ, ‘సంబరాల ఏటిగట్టు’ డైరెక్టర్ రోహిత్ 2021లోనే తనను కలిశాడు. అప్పుడు తను రెండు కోట్లతో చిన్న కథ తీసుకొచ్చాడు. కానీ కిరణ్ అతనికి పెద్ద కథ తీసుకురమ్మని సపోర్ట్ చేశాడు. ఆ తర్వాత రోహిత్ తీసుకొచ్చిన కథకు ‘హనుమాన్’ నిర్మాత నిరంజన్ రెడీ అయ్యాడు. కానీ ప్రీ-ప్రొడక్షన్ సమయంలో కిరణ్ సినిమాలు ఫ్లాప్ అవడంతో బడ్జెట్ 60-70 కోట్లకు పెరిగింది. అప్పటి తన మార్కెట్ కు అది రిస్క్ అని ఫీల్ అయి వద్దన్నాడు.

నిరంజన్ అయినా చేద్దామన్నాడు కానీ కిరణ్ ఒప్పుకోలేదు. ఆ తర్వాతే ఈ ప్రాజెక్ట్ సాయి ధరమ్ తేజ్ దగ్గరికి వెళ్లింది. ప్రస్తుతం ఈ సినిమా 120 కోట్ల బడ్జెట్ తో పాన్-ఇండియా స్థాయిలో తెరకెక్కుతోంది. కిరణ్ ఇందుకు హ్యాపీగా ఉన్నాడు. డైరెక్టర్ తనకు తెలుసని, సినిమా పెద్ద హిట్ అయితే సంతోషంగా ఉంటానని కామెంట్ చేశాడు.

ఇప్పుడు ‘సంబరాల ఏటిగట్టు’ సాయి ధరమ్ తేజ్, ఐశ్వర్య లక్ష్మి జంటగా ప్రైమ్ షో ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై రూపొందుతోంది. ఇక కిరణ్ మాత్రం జులై 24న ‘చెన్నై లవ్ స్టోరీ’తో ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమవుతున్నాడు.

Share your love
PakkaFilmy Telugu

PakkaFilmy Telugu